Health News: రోజూ కాఫీ తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. ప్రయోజనాలను తెలుకుందాం..

|

Jan 02, 2021 | 2:54 PM

రోజూ కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కాఫీని ప్రేమించేవారు ఎక్కువగానే ఉంటారు. కాఫీ తాగడం వలన ఉత్సాహంగా ఉన్నాం అనే భావన

Health News: రోజూ కాఫీ తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. ప్రయోజనాలను తెలుకుందాం..
గ్రెనడా విశ్వవిద్యాలయం ఫిజియాలజీ విభాగం నిర్వహించిన అధ్యయనం ప్రకారం... వ్యాయామం చేయడానికి అరగంట ముందు కాఫీని తాగడం వల్ల కొవ్వు కరిగే ప్రక్రియ వేగవంతం అవుతుందని తేలింది. దీంతో సులువుగా బరువు తగ్గొచ్చు.
Follow us on

రోజూ కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కాఫీని ప్రేమించేవారు ఎక్కువగానే ఉంటారు. కాఫీ తాగడం వలన ఉత్సాహంగా ఉన్నాం అనే భావన కలుగుతోంది. సాధరణంగా చాలా వరకు కాఫీని రోజూలో ఒక్కసారి కంటే ఎక్కువగా తాగేస్తుంటారు. కాఫీ ఎక్కువగా తాగితే లాభామా? నష్టామా? అనే విషయాలను సుధీర్ఘంగా తెలుసుకుందాం.

రోజు ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగితే ఉత్సహంగా ఉంటారట. కాఫీలో ఎడ్రినలిన్ లెవెల్స్‏ని పెంచుతుంది. దీనిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం శరీరంలో ఇన్సులిన్‏ని ఉపయోగించుకోవడం సహయపడుతుంది. అంతేకాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్‏ని కూడా రెగ్యులేట్ చేస్తాయట. కాఫీ తాగడం వలన ఏకగ్రాత పెరుగుతుందట. దీనిలో ఉండే కెఫీన్ బరువు తగ్గడానికి దోహదపడుతుందని నిపుణుల అంచనా. ఇక కాఫీ తాగని వారితో పోలీస్తే కాఫీ తాగేవారు ఆకస్మిక మరణం శాతం తక్కువగా ఉంటుందట. ఇది స్ట్రోక్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుందట. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

కానీ కాఫీని రోజులో ఎక్కువగా తాగితే ప్రమదమే అంటా. రోజూలో కాఫీ ఎక్కువగా తాగడం వలన పునరుత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుంది. శరీరంలో ఉండే విటమిన్ బీ, మెగ్నీషియం లెవెల్స్ తగ్గిపోతాయి. ఇక కాఫీని ఎక్కువగా తాగితే నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవేకాకుండా పాలు, షుగర్ కలిపి ఉన్న కాఫీని అధికంగా తాగితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందని నిపుణల మాట. అందుకే రోజూలో కాఫీని రెండు సార్లకు మించి తాగితే సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

Also Read:

హెల్త్: మీరు రోజులో ఎక్కువగా కాఫీ తాగుతున్నారా ?.. అయితే ఈ అనర్థాలను తెలుసుకోండి..