త్వరలో.. మార్కెట్లోకి కరోనావైరస్ టెస్ట్ కిట్.. 10 నిమిషాల్లో ఫలితం

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. అయితే.. కరోనావైరస్ సంక్రమణను కేవలం 10 నిమిషాల్లో గుర్తించే ప్రయోగాత్మక పరీక్షా కిట్‌ను

  • Updated On - 5:24 pm, Sun, 31 May 20 Edited By:
త్వరలో.. మార్కెట్లోకి కరోనావైరస్ టెస్ట్ కిట్.. 10 నిమిషాల్లో ఫలితం

COVID-19 test kit: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. అయితే.. కరోనావైరస్ సంక్రమణను కేవలం 10 నిమిషాల్లో గుర్తించే ప్రయోగాత్మక పరీక్షా కిట్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ పరీక్ష ద్వారా, కరోనా వైరస్ సంక్రమణను ఈజీగా కనిపెట్టవచ్చు. దీని ఫలితాలు కేవలం 10 నిమిషాల్లో తెలుస్తాయి. దీంతో ప్రపంచ మంతా ఈ తరహా టెస్టులు విస్తృతంగా చేసే చాన్స్ ఉంది. ఈ అధ్యయనం గురించి ACSనానో పత్రికలో ప్రచురించారు.

వివరాల్లోకెళితే.. ఈ పరీక్షలో గోల్డ్ నానోపార్టికల్ ఉపయోగిస్తారు. వైరస్ కనిపెట్టిన వెంటనే దాని రంగు మారుతుంది. మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు దీనిపై స్డడీ చేస్తున్నారు. అంతేకాదు ఈ పరీక్ష కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ప్రయోగశాల అవసరమని పరిశోధకులు తెలిపారు. వైరల్ జన్యు పదార్ధాల విశ్లేషణ ప్రయోగశాల కావాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పరీక్ష ద్వారా RNA వైరస్ సంక్రమణను మొదటి రోజే గుర్తించే ప్రాథమిక ఫలితాలు చూపిస్తాయని అధ్యయనం పేర్కొంది.

కాగా.. ఈ పరీక్ష యొక్క విశ్వసనీయతను పరీక్షించడానికి మరిన్ని అధ్యయనాలు జరగాలని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రయోగాత్మక పరీక్షలలో, గొంతులో స్వాబ్ లేదా లాలాజలం నమూనా ద్వారా సులభంగా RNAను వైరస్ గురించి తెలుసుకోవచ్చని అధ్యయనం చెబుతోంది. దీనికి 10 నిమిషాలు మాత్రమే పడుతుంది. పరీక్ష కిట్ లో తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పరిశోధకులు చెప్పారు.