మాజీ శాసన సభ్యుడు వంగవీటి రాధాకృష్ణ ఢిల్లీ వెళ్లారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఉద్యమం చేస్తున్న రైతులకు ఆయన మద్దతు తెలిపారు. జేఏసీ సభ్యులతో కలిసి ఢిల్లీలో జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శుక్రవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు రాజ్ ఘాట్ దగ్గర మహాత్మగాంధీకి నివాళులు అర్పించారు. ఏపీ రాజధానిగా అమరవతినే కొనసాగించాలంటూ మౌన ప్రదర్శన చేపట్టారు.(వైఎస్ భారతి తండ్రి కన్నుమూత)
ఈ నిరసన కార్యక్రమంలో అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు ఆరె శివా రెడ్డి, తిరుపతి రావు, రైతులు, ఇతర జేఏసీ నాయకులతో పాటు వంగవీటి రాధాకృష్ణ కూడా పాల్గొన్నారు. అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని శాంతియుత మౌన ప్రదర్శన ద్వారా ప్రధాన మోదీకి తమ నిరసన తెలుపుతున్నామని అమరావతి పరిరక్షణ సమితి నేతలు తెలిపారు. వంగవీటి రాధాకృష్ణ మొదటి నుంచి అమరావతి ఉద్యమానికి మద్దతు ఉంటున్నారు. వారితో కలిసి కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
(గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం, ముగ్గురు దుర్మరణం)