టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత మాజీ సారధి సౌరవ్ గంగూలీ మాదిరిగానే ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌ను వేరే స్థాయికి తీసుకెళ్లారని మాజీ కోచ్ జాన్ బుచానన్ చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ స్పోర్ట్స్ మ్యాగజైన్‌కు ఆతడు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.
గంగూలీలో ఉన్న పలు నాయకత్వ లక్షణాలు కోహ్లీలో కూడా ఉన్నాయన్నాడు. అప్పట్లో దాదా ఆటతీరులో అనేక మార్పులు తెచ్చాడు. సహచర క్రికెటర్లకు ఆస్ట్రేలియా లాంటి గొప్ప జట్లను ఎలా ఓడించాలో వంటపట్టించాడు. ఇరు జట్ల మధ్య ఆధిపత్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది గంగూలీ అయితే.. ఇప్పుడు ఆ వంతును కోహ్లీ పూర్తి చేస్తున్నాడని బుచానన్ పేర్కొన్నాడు.
ఇప్పటిదాకా టీమిండియాను కోహ్లీ నడిపించిన తీరు స్పూర్తిదాయకం. 2018-19 సిరీస్‌లో పుజారా, కోహ్లీ, రహనేల నుంచి అద్భుతమైన పెర్ఫార్మన్స్‌లను చూశాం. ఇప్పుడు జరిగే సిరీస్ కూడా ఇరు జట్లకు కీలకం కానుందని బుచానన్ అన్నాడు. కాగా, కోహ్లి మొదటి టెస్ట్ తర్వాత భారత్ తిరిగి రావడం.. ఆ టెస్టు సిరీస్‌కు కీలకం అవుతుందని బుచానన్ వివరించాడు.
Also Read:
పింఛన్‌దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పింఛన్‌ను రెండు విడతలుగా చెల్లించేందుకు.!
జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!
ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. పంచారామాలకు 1,750 స్పెషల్ బస్సులు..