అమేథిలో మొరాయిస్తున్న ఈవీఎంలు..

| Edited By:

May 06, 2019 | 12:06 PM

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదవ దశ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. 7 రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే.. ఉత్తరప్రదేశ్ అమేథిలోని లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న పలు పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో.. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సిబ్బందిని ఆయా బూత్‌లకు పంపి ఈవీఎంలు సరిచేస్తున్నారు. కాగా.. […]

అమేథిలో మొరాయిస్తున్న ఈవీఎంలు..
Follow us on

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదవ దశ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. 7 రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే.. ఉత్తరప్రదేశ్ అమేథిలోని లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న పలు పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో.. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సిబ్బందిని ఆయా బూత్‌లకు పంపి ఈవీఎంలు సరిచేస్తున్నారు. కాగా.. అమేథి నుంచి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. బీజేపీ నుంచి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు.