తుస్సుమన్న టీటీడీ బోర్డు మీటింగ్.. ఈవో, జేఈవో బాయ్‌కాట్

అన్నమయ్య భవన్‌లో ఈ ఉదయం ప్రారంభమైన టీటీడీ పాలకమండలి సమావేశం కాసేపటికే రసాభాసగా మారింది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో బోర్డు సభ్యులంతా తప్పుకోవడం నైతికతని వ్యాఖ్యలు చేసిన బోర్డు సభ్యుడు తెల్లాబాబు, తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు సమావేశంలో వేడిని రగిల్చాయి. మరోవైపు టీటీడీ ఉద్యోగులు బోర్డుకు ఏమాత్రం సహకరించడం లేదని కొందరు చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారాయి. దీంతో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజులు సమావేశం మధ్యలోనే […]

తుస్సుమన్న టీటీడీ బోర్డు మీటింగ్.. ఈవో, జేఈవో బాయ్‌కాట్
Follow us

| Edited By:

Updated on: May 28, 2019 | 11:33 AM

అన్నమయ్య భవన్‌లో ఈ ఉదయం ప్రారంభమైన టీటీడీ పాలకమండలి సమావేశం కాసేపటికే రసాభాసగా మారింది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో బోర్డు సభ్యులంతా తప్పుకోవడం నైతికతని వ్యాఖ్యలు చేసిన బోర్డు సభ్యుడు తెల్లాబాబు, తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు సమావేశంలో వేడిని రగిల్చాయి. మరోవైపు టీటీడీ ఉద్యోగులు బోర్డుకు ఏమాత్రం సహకరించడం లేదని కొందరు చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారాయి. దీంతో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజులు సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు.

అనంతరం టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.. టీటీడీ అధికారులు సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారని వెల్లడించారు. గత ప్రభుత్వం ఈ బోర్డును నియమించిందని.. కొత్త ప్రభుత్వం బోర్డును రద్దు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. కాగా ఈ సమావేశంలో ఎలాంటి అంశాలపై చర్చ జరగలేదని పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. అయితే నేటి పాలకమండలి సమావేశం జరిగిన తీరును ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులను అడిగి తెలుసుకున్నారు.