ఏపీలోకి ఎంటర్ కావాలంటే.. ఆ యాప్‌లో రిజిస్టర్ కావాల్సిందే..
కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. లాక్ డౌన్ సడలింపులు సరళతరం అయ్యాయి. ఈ క్రమంలో అన్ లాక్ 2.O అమలులో భాగంగా అంతర్ రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు లేవని

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. లాక్ డౌన్ సడలింపులు సరళతరం అయ్యాయి. ఈ క్రమంలో అన్ లాక్ 2.O అమలులో భాగంగా అంతర్ రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు లేవని కేంద్రం స్పష్టంగా ప్రకటించినా ఆంధ్ర ప్రదేశ్ మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ఏపీ పౌరులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. కేవలం స్పందన యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారు.. అది కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అనుమతి ఇస్తామని ఏపీ డీజీపీ ప్రకటించారు.
హైవేలపై అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు ఆంక్షలు అవసరం లేదని కేంద్ర హోంశాఖ అన్ లాక్ 2.O మార్గదర్శకాల్లో తెలిపింది. దీంతో పలువురు అనుమతి లేకుండా స్వస్థలాలకు వెళ్లేందుకు బయలుదేరారు. అయితే ఏపీ సరిహద్దుల్లో వారిని అడ్డుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారిని అనుమతించే విషయంలో నిబంధనలు పాటించాల్సిందేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: ఆదాయమే లక్ష్యంగా.. తెలంగాణలో మరో రెండు టోల్‌ప్లాజాలు..



