Stuart Broad Gets Engaged: గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్.. సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేసిన ఫాస్ట్ బౌలర్..

Stuart Broad Gets Engaged: ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతున్నాడు. తన ప్రియురాలు, సింగర్...

Stuart Broad Gets Engaged: గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్.. సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేసిన ఫాస్ట్ బౌలర్..

Updated on: Jan 02, 2021 | 10:15 PM

Stuart Broad Gets Engaged: ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతున్నాడు. తన ప్రియురాలు, సింగర్ మోలీ కింగ్‌తో ఎంగేజ్‌మెంట్ అయ్యింది. ఈ విషయాన్ని స్టువర్ట్ బ్రాండ్ స్వయంగా వెల్లడించాడు. ఈ 34 ఏళ్ల స్టువర్ట్.. తన ఎంగేజ్‌మెంట్‌ను ధృవీకరిస్తూ ఇద్దరూ కిస్ చేస్తున్నటువంటి ఫోటోను ఒకదానిని ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేశాడు. 2021 ప్రారంభించడానికి ఇదే సరైన మార్గం అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. కాగా, అదే ఫోటోను మోలీ కూడా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ‘ఇంకా నేను వేచి ఉండలేను’ అంటూ క్యాప్షన్ పెట్టింది. వీరి ఫోటో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కాగా, స్టువర్ట్‌, మోలీ జంటకు క్రికెటర్లతో పాటు, పెద్ద ఎత్తున అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

Stuart Broad Shared Pic:

 

Also read:

TS RTC Special buses: సంక్రాంతి పండగకు హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు 4,980 ప్రత్యేక బస్సులు

అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు : ‘పోలీసులూ ఖబడ్దార్, ఇక ఎక్కువ కాలం లేదు, లిస్ట్‌ తయారు చేశాం..’