మూడో టెస్టులో పట్టుబిగించిన ఇంగ్లాండ్…

సౌతాంప్టన్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లాండ్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 273 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో ఇంగ్లాండ్ కు 310 పరుగుల ఆధిక్యం దక్కింది.

మూడో టెస్టులో పట్టుబిగించిన ఇంగ్లాండ్...
Follow us

|

Updated on: Aug 24, 2020 | 8:25 PM

ENG Vs PAK: సౌతాంప్టన్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లాండ్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 273 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో ఇంగ్లాండ్ కు 310 పరుగుల ఆధిక్యం దక్కింది. ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్(5/56) పాక్ పతనంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్ కెప్టెన్ అజహర్ అలీ(141*), రిజ్వాన్(53) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్ అందరూ కూడా ఘోరంగా విఫలమయ్యారు.

Also Read: బాలకృష్ణ గొప్ప మనసు.. కోవిడ్ ఆసుపత్రికి భారీ విరాళం..

అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 583/8 రన్స్ దగ్గర డిక్లర్ చేసింది. జాక్ క్రాలే(267) డబుల్ సెంచరీతో అదరగొట్టగా.. బట్లర్(152) సెంచరీతో ఇంగ్లాండ్.. పాకిస్తాన్ ముందు భారీ స్కోర్ ఉంచింది. కాగా, ప్రస్తుతం పాకిస్తాన్ ఫాలో ఆన్ ఆడుతోంది. కాగా, ఆండర్సన్ టెస్టుల్లో 29 సార్లు 5 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు.

Also Read: ఢిల్లీ టూ లండన్.. బస్సులో అడ్వెంచర్ జర్నీ..