35 ఏళ్లకు బూటకపు ఎన్‌కౌంటర్‌గా తేల్చిన కోర్టు

|

Jul 22, 2020 | 4:52 PM

తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరన్నదీ మరోసారి రుజువైంది. 35 ఏండ్ల కిందట జరిగిన ఎన్‌కౌంటర్‌ను ఫేక్ ఘటనగా ఉత్తరప్రదేశ్ కోర్టు తేల్చింది. ఇందుకు సంబంధించి 11 మంది పోలీసులను దోషులుగా నిర్ధారించింది. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరిచింది.

35 ఏళ్లకు బూటకపు ఎన్‌కౌంటర్‌గా తేల్చిన కోర్టు
Follow us on

తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరన్నదీ మరోసారి రుజువైంది. 35 ఏండ్ల కిందట జరిగిన ఎన్‌కౌంటర్‌ను ఫేక్ ఘటనగా ఉత్తరప్రదేశ్ కోర్టు తేల్చింది. ఇందుకు సంబంధించి 11 మంది పోలీసులను దోషులుగా నిర్ధారించింది. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరిచింది. ఎన్‌కౌంటర్‌ను బూటకంగా తేలుస్తూ 11 మంది పోలీసులను దోషులుగా నిర్ణయించింది.

రాజస్థాన్‌లో భరత్‌పూర్‌ రాజ కుటుంబ సభ్యుల్లో ఒకరైన రాజామాన్‌ సింగ్‌ 1985లో స్వతంత్ర అభ్యర్థిగా అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. తన ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి తరఫున మాజీ ముఖ్యమంత్రి శివచరణ్‌ మాథుర్‌ ప్రచారానికి వచ్చినప్పుడు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా ఆగి ఉన్న సీఎం హెలికాప్టర్‌ను మాన్‌సింగ్‌ తన జీపుతో ఢీకొట్టారు. ఈ ఘటన జరిగిన మరుసటిరోజు ఫిబ్రవరి 21న పోలీసులు మాన్‌సింగ్‌తోపాటు అతడి ఇద్దరి అనుచరులను కాల్చిచంపారు. ఇదంతా ఎదురుకాల్పుల్లో చనిపోయినట్లు పోలీసులు నాటకాన్ని క్రియేట్ చేశారు. అయితే, ఇదంతా కట్టుకథ అని మాన్‌సింగ్‌ కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ముధుర జిల్లా కోర్టు.. ఎట్టకేలకు 35 సంవత్సరాల తరువాత తీర్పును వెల్లడించింది. తొలుత ఈ కేసు విచారణ తొలుత రాజస్థాన్‌లో జరిగినప్పటికీ.. ఆ తర్వాత యూపీకి బదిలీ అయ్యింది. కోర్టు తీర్పు పట్ల మాన్‌సింగ్‌ కుటుంబసభ్యలు హర్షం వ్యక్తం చేశారు.