Elephant Groups Hulchul : చిత్తూరు శివారులోని కొట్రకోన ప్రాంతంలో తిష్ట వేసిన ఏనుగులు..ఆందోళనలో రైతన్నలు

|

Jan 04, 2021 | 9:40 AM

చిత్తూరు జిల్లా వాసులను ఏనుగులు టెన్షన్ పెడుతున్నాయి.  కొట్రకోన ప్రాంతంలో  ఏనుగుల గుంపు తిష్ట వేసింది. దీంతో అప్రమత్తమైన  అటవీశాఖ సిబ్బంది వాటిని కౌండిన్య అభయారణ్యం వైపు...

Elephant Groups Hulchul : చిత్తూరు శివారులోని కొట్రకోన ప్రాంతంలో తిష్ట వేసిన ఏనుగులు..ఆందోళనలో రైతన్నలు
Follow us on

చిత్తూరు జిల్లా వాసులను ఏనుగులు టెన్షన్ పెడుతున్నాయి.  కొట్రకోన ప్రాంతంలో  ఏనుగుల గుంపు తిష్ట వేసింది. దీంతో అప్రమత్తమైన  అటవీశాఖ సిబ్బంది వాటిని కౌండిన్య అభయారణ్యం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడు అటవీ ప్రాంతం నుంచి చిత్తూరు వైపు వచ్చాయి ఈ గజరాజులు. గుడిపాల, యాదమరి, బంగారుపాల్యం వైపు నుంచి పలమనేరు అటవీ ప్రాంతం వైపు ఏనుగులను డ్రైవ్ చేస్తున్నారు అటవీశాఖ అధికారులు. ఆయా ప్రాంతాల గ్రామాల్లోని ప్రజలను అలర్ట్ చేశారు. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట పొలాలపై దాడి చేస్తున్నాయి. చేతికందొచ్చిన పంటను నాశనం చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏనుగుల గుంపు దాడి చేస్తుందేమోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగులు రెండు గుంపులుగా విడిపోయి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. డ్రోన్‌ కెమెరా సాయంతో గజరాజుల కదలికలు తెలుకుంటున్నామనీ, వాటిని అడవుల్లోకి పంపడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ శాఖ అధికారులు చెప్పారు.

 

Also Read :

Hyderabad To Vishakapatnam Train: పండుగ వేళ రైల్వే శాఖ గుడ్ న్యూస్.. కాచిగూడ-విశాఖపట్నం సర్వీసు పున:ప్రారంభం

Bird Flu Alert: రాష్ట్రాలకు కేంద్రం హై అలర్ట్.. బ‌ర్డ్ ఫ్లూ మనుషులకూ వ్యాప్తి చెందే అవకాశం..పలు ఆదేశాలు జారీ