హింస చెలరేగే అవకాశం ఉంది..!

| Edited By:

May 23, 2019 | 7:45 AM

దేశ వ్యాప్తంగా మొత్తం 542 లోక్‌సభ స్థానాలకు గానూ.. 10.3 లక్షల కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించి.. 20 వేల 600 కేంద్రాల్లో వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించేందుకు రెడీ అయింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశవ్యాప్తంగా 67.11 శాతం పోలింగ్ నమోదు కాగా.. మొత్తం 99 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. అయితే ఇప్పటివరకు భారత పార్లమెంట్‌కు నమోదైన ఓటింగ్‌లో ఇదే అత్యధిక శాతం కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, […]

హింస చెలరేగే అవకాశం ఉంది..!
Follow us on

దేశ వ్యాప్తంగా మొత్తం 542 లోక్‌సభ స్థానాలకు గానూ.. 10.3 లక్షల కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించి.. 20 వేల 600 కేంద్రాల్లో వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించేందుకు రెడీ అయింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశవ్యాప్తంగా 67.11 శాతం పోలింగ్ నమోదు కాగా.. మొత్తం 99 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. అయితే ఇప్పటివరకు భారత పార్లమెంట్‌కు నమోదైన ఓటింగ్‌లో ఇదే అత్యధిక శాతం కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు మొత్తం ఏడు దశల్లో జరిగిన ఓటర్లు ఏ పార్టీ వైపున నలిచారో.. ఏ నేతలకు పట్టం కట్టబోతున్నారనే ఉత్కంఠకు తెరపడనుంది.

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో హింస చెలరేగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుతాలను హెచ్చరించింది కేంద్ర హోంశాఖ. ఈవీఎంలను భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని తెలిపింది.