‘చెప్పు’తో చెప్పే పార్టీ గెలుస్తుందా..?

ఏపీలో ఏ పార్టీ గెలవబోతుంది..? ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. ఇది తేలాలంటే మే 23 వరకు ఆగాల్సిందే. అయితే.. అంత వరకు ఆగాల్సిన అవసరం లేదంటున్నాడు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మంత్రగాడు. ఏ నియోజక వర్గం పేరు చెప్పినా.. ఫలితం ఇట్టే చెప్పేస్తానని అంటున్నాడు. మీరు నియోజక వర్గం పేరు చెప్పండి.. చాలు.. అక్కడ గెలిచే అభ్యర్థి ఎవరో తేల్చేస్తానని అంటున్నాడు. టీడీపీ, వైసీపీ పేర్లు పలుకుతూ పూజలు చేస్తూ.. గెలిచే […]

చెప్పుతో చెప్పే పార్టీ గెలుస్తుందా..?

Edited By:

Updated on: Apr 19, 2019 | 12:10 PM

ఏపీలో ఏ పార్టీ గెలవబోతుంది..? ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. ఇది తేలాలంటే మే 23 వరకు ఆగాల్సిందే. అయితే.. అంత వరకు ఆగాల్సిన అవసరం లేదంటున్నాడు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మంత్రగాడు. ఏ నియోజక వర్గం పేరు చెప్పినా.. ఫలితం ఇట్టే చెప్పేస్తానని అంటున్నాడు. మీరు నియోజక వర్గం పేరు చెప్పండి.. చాలు.. అక్కడ గెలిచే అభ్యర్థి ఎవరో తేల్చేస్తానని అంటున్నాడు.

టీడీపీ, వైసీపీ పేర్లు పలుకుతూ పూజలు చేస్తూ.. గెలిచే పార్టీ పేరు, అభ్యర్థి పేరు చెప్పగానే చేతి వేళ్ల చుట్టూ చెప్పు తిరుగుతుందని నమ్మబలుకుతున్నాడు. ఇదే అదననుకొని తమ పార్టీయే గెలుస్తోందంటూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నాడు ఓ పార్టీ కార్యకర్త.

ఏపీలో అధికారం చేపట్టేది తమ పార్టీ అంటే తమ పార్టీ అని ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరో వైపు ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్స్ సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ బెట్టింగుల్లో లక్షలు, కోట్లు చేతులు మారుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.