జీహెచ్ఎంసీలో వరద సాయంపై ఎన్నికల కమిషన్ క్లారిటీ.. నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని సూచన

|

Nov 17, 2020 | 2:40 PM

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముంచెత్తిన వరదలకు సాయం కొనసాగుతుందా లేదా అన్నదానిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది.

జీహెచ్ఎంసీలో వరద సాయంపై ఎన్నికల కమిషన్ క్లారిటీ.. నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని సూచన
Follow us on

#GHMCElections: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముంచెత్తిన వరదలకు సాయం కొనసాగుతుందా లేదా అన్నదానిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. మంగళవారం నాడు ఎన్నికల కమిషనర్ పార్థసారధి జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా వరదసాయంపై కూడా కమిషనర్ మాట్లాడారు. నిబంధనల మేరకు బాధితులకు వరద సహాయం చేయవచ్చు. డబ్బులు చేతికి కాకుండా బాధితుల బ్యాంకు అకౌంట్లలో మాత్రమే వేయాలని పార్థసారధి స్పష్టం చేశారు. ఇవాళ్టి నుంచే గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

కాగా.. నిన్న ఒక్కరోజే రూ.55 కోట్లు బాధితుల బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం జమచేసింది. వరదలు తగ్గిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఇంకా మీసేవా కేంద్రాల వద్ద రద్దీ తగ్గలేదు. మరోవైపు.. ఇవాళ ఉదయం నుంచి భాగ్యనగరంలోని పలు మీ సేవా కేంద్రాల వద్ద భారీగానే బాధితులు బారులు తీరారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటనతో.. వరద సాయం అందని బాధితులు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి మీసేవ కేంద్రాలకు ఎగబడ్డారు. దీంతో ఒక్కో అప్లికేషన్ సబ్‌మిట్ చేసేందుకు రూ. 200 ఖర్చు అవుతోంది. సిబ్బంది కొరత, సర్వర్లు మొరాయించడంతో ఆలస్యం అవుతోందని మీ సేవ నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు, అకౌంట్‌లో నేరుగా వరద సహాయం జమ చేయాలంటూ బాధితుల ఆందోళన చేస్తున్నారు. ఇవాళ ఎన్నికల కమిషన్ ప్రకటన వరద బాధితులకు కాస్త ఊరట కలిగించే విషయమే.