నిత్యావసర వస్తువుల ఉత్పత్తిపై ఎల్నీనో ఎఫెక్ట్.. రాబోయే రోజుల్లో ధరలు ఎలా ఉండబోతున్నాయంటే?
ఎల్నీనో.. దీని ప్రభావంతో ఇప్పటికే దేశ వ్యాప్తంగా వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా.. ఉత్పత్తి తగ్గి ఇప్పటికే బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. అయితే రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువులైన చక్కెర, వంటనూనె ధరలు కూడా భారీ పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు అంచానా వేస్తున్నారు.

ఎల్నీలనో.. రైతుల నుంచి సామాన్య ప్రజలకు వరకు ప్రతి ఒక్కరికీ ఇది పెను శాపంగా మారింది. ఓ పక్క వర్షాలు లేక రైతులు వేసిన పంటలు ఎండిపోతుంటే.. మరోవైపు ఉత్పత్తి తగ్గి నిత్యావసర వస్తుల ధరలు పెరిగి సమాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చెరకు ఉత్పత్తిలో అతిపెద్ద ఉత్పత్తి దారైన మన దేశంలో పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎల్‌నినో తీవ్రరూపం దాల్చడంతో దేశంలో చక్కెర ఉత్పత్తిపై తీవ్ర ఆందోళనలు నెకొన్నాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో చెరకు దిగుబడి మరింత పడిపోయే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ ఎల్‌నినో ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు ఇది కొనసాగే అవకాశం ఉందనే WMO అంచనాలు సమాన్యులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎందుకంటే దీని ప్రభావం చక్కెర మిల్లులపై పడి 2027 ప్రారంభంలో మిల్లింగ్ కార్యకలాపాలు సంక్లిష్టంగా మారవచ్చని, చెరకు దిగుబడి తగ్గడంతో పాటు చక్కెర రికవరీ రేటు కూడా పడిపోతుందని WMO పేర్కొంది. దీని వల్ల చక్కెర ధరలు కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉందనే ప్రచారం మొదలైంది.
ఆకాశాన్నంటుతున్న చక్కెర ధరలు
అయితే ఇప్పటికే దేశంలో చక్కెర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సమయంలో ఇలాంటి హెచ్చరికలు రావడం ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం.. రిటైల్ మార్కెట్లో చక్కెర ధర అక్టోబర్ 8, 2021న కిలోకు రూ. 42.18 గా ఉండగా, నాలుగేళ్లలో పెద్దగా మార్పులు లేకపోయినా.. గడిచిన ఏడాదిలోనే 18 శాతానికిపైగా పెరిగి అక్టోబర్ 8, 2026 నాటికి కిలో రూ. 55.21 కి చేరుకున్నాయి. ఇందుకు ప్రధాన కారణం దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు కారణమని ప్రభుత్వం పేర్కొంది.
చెరుకును ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ప్రతికూల వాతావరణం వల్ల పంట దెబ్బతినడంతో ఉత్పత్తి తగ్గిందని.. దీనికితోడు పండుగల సీజన్ ప్రారంభం కావడంతో చక్కెరకు డిమాండ్ పెరిగి అంతర్జాతీయ మార్కెట్లో కూడా సరఫరా తగ్గి గ్లోబల్ ధరలు పెరిగాయని ఎలిపింది. అలాగే మార్కెట్లో కొంతమంది వ్యాపారులు చేస్తున్న అక్రమ నిల్వలు కూడా ఈ ధరల పెరుగుదలకు కారణమని తెలిపింది. అయితే ప్రస్తుతానికైతే దేశీయ డిమాండ్‌కు సరిపడా చక్కెర నిల్వలు ఉన్నాయని.. ఒక వేళ ఎల్లీలో ప్రభావం ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రం అయ్యే ఛాన్స్ ఉందిని తెలిపింది.
వంటనూనెపై ఎల్నీనో ఎఫెక్ట్…
అయితే ఈ ఎల్నీనో ప్రభావంత కేవలం షుగర్ దగ్గరే ఆగిపోలేదు.. నిత్యావసర సరుకుల్లో ముఖ్యమైన బియ్యం, వంటనూనెపై కూడా ఇప్పటికే తీవ్ర ప్రభావం పడుతోంది. దేశీయంగా పంటల దిగుబడి తగ్గడం, అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతినే సూచనలు కనిపిస్తుండటంతో 2027 నాటికి దేశంలో వంటనూనెల కొరత తీవ్రమై, ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అంచనాల ప్రకారం.. 2025-26 సీజన్లో దేశీయ నూనె ఉత్పత్తి 9.6 మిలియన్ టన్నులుగా ఉండగా.. వాతావరణ మార్పుల కారణంగా రాబోయే 2026-27 సీజన్లో ఉత్పత్తి 5 నుంచి 10 శాతం తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా డిమాండ్ పెరిగి.. ధరకు కూడా పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంచానా వస్తున్నారు. ఈ పరిస్థితి కేవలంలో భారత్‌లోనే కాదు.. మనం వినియోగించే నూనెల్లో ఎక్కువ శాతం ఇండోనేషియా, మలేషియాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం.
అయితే అక్కడ కూడా ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఫామాయిల్ తోటలకు నీరు కరువైందట. దీనికితోడు నల్లసముద్రం ప్రాంతం నుంచి పొద్దుతిరుగుడు నూనె సరఫరాలో అంతరాయాలు, దక్షిణ అమెరికాలో సోయా నూనె ఎగుమతులు తగ్గడం వల్ల 2027 నాటికి గ్లోబల్ వెజిటబుల్ ఆయిల్ ధరలు పెరుగుతాయని అంచనాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
