ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ పండుగ.. త్యాగానికి ప్రతీక..

| Edited By:

Aug 12, 2019 | 9:22 AM

పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని.. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చారిత్రాత్మక మసీదుల్లో నిర్వహించిన ప్రార్థనల్లో ఆయా దేశాల ప్రముఖులు పాల్గొన్నారు. సిరియా రాజధాని డమాస్కస్​లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలకు ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్​​ అసద్​ హాజరయ్యారు. వారితో పాటు మత పెద్దలు, అధికారులు కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. బక్రీద్ సందర్భంగా గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముస్లింలకు శుభాకాంక్షలు […]

ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ పండుగ.. త్యాగానికి ప్రతీక..
Follow us on

పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని.. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చారిత్రాత్మక మసీదుల్లో నిర్వహించిన ప్రార్థనల్లో ఆయా దేశాల ప్రముఖులు పాల్గొన్నారు. సిరియా రాజధాని డమాస్కస్​లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలకు ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్​​ అసద్​ హాజరయ్యారు. వారితో పాటు మత పెద్దలు, అధికారులు కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు.

బక్రీద్ సందర్భంగా గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ త్యాగానికి ప్రతీక. భగవంతుడిని పరిపూర్ణ భక్తితో ఆరాధించే పర్వదినం ఇది. సమాజంలో ఇతరులకు దానం చేయడం వంటి స్ఫూర్తిదాయకమైన విధానానికి ఈ పండుగ ఒక వేదిక అని గవర్నర్ తెలిపారు.

ప్రేమ, సోదరభావం, మానవ సేవ బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ప్రేమ, సోదరభావం, మానవసేవ అనే సందేశాలను బక్రీద్ సూచిస్తున్నదని ఆయన చెప్పారు.