కమల్‌పై మరో దాడి.. ఈ సారి కోడిగుడ్లతో

| Edited By:

May 17, 2019 | 10:36 AM

గాంధీజీని హతమార్చిన గాడ్సే తొలి హిందూ తీవ్రవాది అంటూ వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, ఎంఎన్‌ఎం పార్టీ చీఫ్‌ కమల్‌హాసన్‌పై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరుగుతోంది. గురువారం ఆయనపై రెండుచోట్ల దాడులు జరిగాయి. అరవకురిచ్చిలో ఎన్నికల సభలో ప్రసంగించి వేదిక దిగుతుండగా, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చెప్పులు, కోడిగుడ్లు, రాళ్లతో ఆయనపై దాడి చేశారు. గాడ్సేపై కమల్‌ అరవకురిచ్చిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, గురువారం అదేచోట ఆయనపై దాడి జరగింది. ఎంఎన్‌ఎం కార్యకర్తలు ఇద్దరిని అనుమానించి దేహశుద్ధి చేయగా, […]

కమల్‌పై మరో దాడి.. ఈ సారి కోడిగుడ్లతో
Follow us on

గాంధీజీని హతమార్చిన గాడ్సే తొలి హిందూ తీవ్రవాది అంటూ వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, ఎంఎన్‌ఎం పార్టీ చీఫ్‌ కమల్‌హాసన్‌పై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరుగుతోంది. గురువారం ఆయనపై రెండుచోట్ల దాడులు జరిగాయి. అరవకురిచ్చిలో ఎన్నికల సభలో ప్రసంగించి వేదిక దిగుతుండగా, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చెప్పులు, కోడిగుడ్లు, రాళ్లతో ఆయనపై దాడి చేశారు.

గాడ్సేపై కమల్‌ అరవకురిచ్చిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, గురువారం అదేచోట ఆయనపై దాడి జరగింది. ఎంఎన్‌ఎం కార్యకర్తలు ఇద్దరిని అనుమానించి దేహశుద్ధి చేయగా, పోలీసులు జోక్యం చేసుకుని వారిని రక్షించారు. మరోవైపు సులూర్‌ ఉప ఎన్నికలో శుక్రవారం కమల్‌హాసన్‌ పాల్గొనే సభలకు కోయంబత్తూరు జిల్లా పోలీసులు అనుమతి నిరాకరించారు.

కమల్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ, హిందూ మున్నాని నాయకులు రాష్ట్రంలో ఆందోళనలు చేయడంతో ఆయన రెండు రోజులపాటు ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. తిరిగి గురువారం రాత్రి తిరుప్పరంకుండ్రం సన్నిధి వీధిలో బహిరంగ సభలో కమల్‌ మాట్లాడుతుండగా కొంతమంది యువకులు ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేస్తూ కమల్‌పైకి చెప్పులు, కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. బీజేపీ, హనుమాన్‌సేవ సంస్థలకు చెందిన 11మందిని పోలీసులు అరెస్టు చేశారు.