AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్స్‌పై ఈడీ కేసులు

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్స్‌పై ఈడీ దూకుడు పెంచింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్స్‌ నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. చైనా యాప్స్‌, వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ద్వారా 1100 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. యాప్స్‌తో చైనా భారీ మోసాలకు పాల్పడుతుండటంతో ఈడీ కేసులు నమోదు చేసింది.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్స్‌పై ఈడీ కేసులు
Balaraju Goud
|

Updated on: Aug 18, 2020 | 11:42 AM

Share

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్స్‌పై ఈడీ దూకుడు పెంచింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్స్‌ నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. చైనా యాప్స్‌, వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ద్వారా 1100 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. యాప్స్‌తో చైనా భారీ మోసాలకు పాల్పడుతుండటంతో ఈడీ కేసులు నమోదు చేసింది. సికింద్రాబాద్‌కు చెందిన ఓ బాధితుడు జూలై 27న 97 వేలు పోగొట్టుకున్నాడు. గత వారం ఇలాంటిదే మరో ఫిర్యాదు వచ్చింది. కంచన్‌బాగ్‌కు చెందిన మరో బాధితుడు ఆన్‌లైన్‌ గేమింగ్‌లో 1.64 లక్షలు నష్టపోయాడని అంజనీకుమార్‌ వివరించారు. తెలంగాణ గేమింగ్‌ చట్టం, భారత శిక్షా స్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సైబర్‌క్రైమ్‌ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బాధితులు డబ్బును బదిలీ చేసిన ఖాతాలపై దృష్టి సారించారు. ఈ గేమింగ్‌ వ్యవహారమంతా సోషల్‌ మీడియాలో ప్రారంభమై అక్కడి నుంచి టెలిగ్రామ్‌లోకి,, ఆ తర్వాత ఒక్కరోజు మాత్రమే పనిచేసే గేమింగ్‌ సైట్లకు మారుతుందని పేర్కొన్నారు.

మొదట కొందరు దళారులు అమాయకులను సోషల్‌ మీడియాలో గుర్తిస్తారు. వారికి కలర్‌ ప్రిడిక్షన్‌లో చెప్పే రంగుతో డబ్బులే డబ్బులని నమ్మబలుకుతారు. ఆ తర్వాత టెలిగ్రామ్‌ చానల్‌ లింకును పంపుతారు. అలా చానల్‌లో సభ్యులను చేర్చే దళారులకు ఆయా చానల్‌ల అడ్మిన్ల నుంచి కమీషన్‌ దక్కుతుంది. చానల్‌ అడ్మిన్లు రోజువారీగా కలర్‌ ప్రిడిక్షన్‌ వెబ్‌సైట్ల వివరాలను గ్రూపులో పెడతారు. యూజర్లు ఆ లింకును అనుసరించి ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఆడాల్సి ఉంటుంది. గేమింగ్‌, బెట్టింగ్‌ వెబ్‌సైట్లను చానల్‌ అడ్మిన్లు సూచిస్తుంటారు. ఆయా వెబ్‌సైట్లు ఒక్కరోజే లైవ్‌లో ఉంటాయని వివరించారు. హైదారాబాద్ నగరానికి చెందిన రెండు కేసులకు సంబంధించిన కంపెనీల అధికారులను అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. ఈ కంపెనీల్లో భారతీయులు కూడా డైరెక్టర్లుగా ఉన్నారని, వీరంతా ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నారన్నారు.