చెన్నై : తమిళనాడులో జరిగిన వాహనాల తనిఖీల్లో భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. కోయంబత్తూరు సమీపంలోని పులియాకుళం ప్రాంతంలో 146 కిలోల బంగారు కడ్డీలను ఎన్నికల సంఘం అధికారులు స్వాధీనం చేసుకుంది. ఈ బంగారాన్ని ఓ వ్యాన్‌లో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఒక ప్రముఖ బంగారు నగల దుకాణానికి సరఫరా చేసేందుకు తీసుకెళ్తున్నామని వాహనంలో ఉన్నవాళ్లు తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. అయితే బంగారానికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.