ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్.. రిలీజ్..!

ఏపీ, తెలంగాణల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి షెడ్యూల్ విడుదల అయ్యింది. ఏపీలో మూడు, తెలంగాణలో ఒక సీటుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. ఏపీలో కరణం బలరాం, ఆళ్లనాని కొల్లగట్ల వీరభద్రస్వామి రాజీనామాతో ఉప ఎన్నికలు అవసరమైంది. తెలంగాణలో యాదవరెడ్డిపై అనర్హత వేటుతో ఉప ఎన్నిక జరగబోతోంది. ఉప ఎన్నికలకు సంబంధించి ఈ నెల 7న నోటిఫికేషన్ జారీ కాబోతోంది. నామినేషన్ల చివరి తేదీ ఈ నెల 14, 16న పరిశీలన […]

ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్.. రిలీజ్..!
MLC Elections

Edited By:

Updated on: Aug 01, 2019 | 7:50 PM

ఏపీ, తెలంగాణల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి షెడ్యూల్ విడుదల అయ్యింది. ఏపీలో మూడు, తెలంగాణలో ఒక సీటుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. ఏపీలో కరణం బలరాం, ఆళ్లనాని కొల్లగట్ల వీరభద్రస్వామి రాజీనామాతో ఉప ఎన్నికలు అవసరమైంది. తెలంగాణలో యాదవరెడ్డిపై అనర్హత వేటుతో ఉప ఎన్నిక జరగబోతోంది.

ఉప ఎన్నికలకు సంబంధించి ఈ నెల 7న నోటిఫికేషన్ జారీ కాబోతోంది. నామినేషన్ల చివరి తేదీ ఈ నెల 14, 16న పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఆగష్టు 19. ఇక ఈ నెల 26న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ ప్రారంభమవుతుంది.