Kidney stones: హాస్పిటల్ కి వెళ్లకుండానే కిడ్నీలో రాళ్లు కరిగిపోవాలంటే ఈ పండ్లు తినండి..!

|

Nov 11, 2023 | 9:37 AM

కాల్షియం ఆక్సోలేట్ అనేది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. ముఖ్యంగా చికెన్, మటన్, చేపలు, గుడ్లు, పోర్క్ వంటివి ఎక్కువగా తింటే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ముందు యూరిక్ యాసిడ్ ను నియంత్రణలో ఉంచాలి. కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.

Kidney stones: హాస్పిటల్ కి వెళ్లకుండానే కిడ్నీలో రాళ్లు కరిగిపోవాలంటే ఈ పండ్లు తినండి..!
Follow us on

Kidney stones: కిడ్నీలో రాళ్లు..ఈ రోజుల్లో చాలా సాధారణ సమస్యగా మారింది. ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ సమస్యతో పోరాడుతున్నారు. రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణాలలో ఒకటి పేలవమైన జీవనశైలి, ఆహారం, మూత్రపిండాలలోని అదనపు ఖనిజాలు రాళ్లను ఏర్పరుస్తాయి. అందువల్ల మీరు అధిక మొత్తంలో ఆక్సలేట్ కలిగి ఉన్న అటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉండాలి. అయితే, కిడ్నీలో రాళ్ల సమస్యకు దూరంగా ఉండాలంటే కొన్ని పదార్థాలను తీసుకోవడం మంచిది. ఇలాంటి ఆహారాలతో ఈజీగా కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయి.అవును కొన్ని పండ్లు తింటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు ఈ పండ్లను రోజూ తినాలి..

జ్యుసి ఫ్రూట్స్ :

ఇవి కూడా చదవండి

కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ, సీతాఫలం వంటి నీరు అధికంగా ఉండే పండ్లను రోజూ తినండి. ఎందుకంటే నీరు ఉన్న ఆహారాలు రాళ్లను కరిగించడంలో సహాయపడతాయి. అందుచేత వీలైనంత ఎక్కువ నీరు అధికంగా ఉండే పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. అదే సమయంలో నీళ్లు ఎక్కువగా తాగాలి.

పుల్లని పండ్లు :

సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రాళ్లను కరిగించడానికి పనిచేస్తుంది. సిట్రస్ పండ్లు, రసాలలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది. దీని కోసం మీరు నారింజ, బత్తాయి, ద్రాక్ష వంటి పండ్లను తరచూగా తీసుకోవటం మంచిది.

కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు:

ఇకపోతే, మీరు తినే ఆహారంతో శరీరంలో మెగ్నీషియం తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. కాల్షియం ఆక్సోలేట్ అనేది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. ముఖ్యంగా మాంసం, పోర్క్, చికెన్, మటన్, చేపలు, గుడ్లు ఎక్కువగా తింటే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ముందు యూరిక్ యాసిడ్ ను నియంత్రణలో ఉంచాలి. కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. దీని కోసం నల్ల ద్రాక్ష, అంజీర పండ్లను మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. దోసకాయ మొదలైన వాటిలో నీరు సమృద్ధిగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..