తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం : ముగ్గురు యువకులు దుర్మరణం

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టుకు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు యువకులు స్పాట్ లోనే ప్రాణాలు విడిచారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం : ముగ్గురు యువకులు దుర్మరణం

Updated on: Sep 20, 2020 | 6:13 PM

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టుకు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు యువకులు స్పాట్ లోనే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను రంపచోడవరం గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. మృతులు విజయవాడకు చెందిన పర్ణసాయి, పులి ప్రవీణ్ కుమార్​, కొత్తగూడెంకు చెందిన భరత్​గా గుర్తించారు. వీరంతా పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు విజయవాడ నుంచి మారేడుమిల్లి బయల్దేరినట్లు తెలుస్తోంది. కాసేపట్లో గమ్యాన్ని చేరుకుంటారనగా యాక్సిడెంట్ జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనాస్థలికి చేరుకున్న పొలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Also Read :

ఏపీలో రేపటి నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం.. ఈ రూల్స్ తప్పనిసరి

 వానలే వానలు : మరో అల్పపీడనం, ఏపీకి భారీ వర్ష సూచన

Loading...
Unable to load recommendations.
Follow Us