దీపావళి పండుగ వేళ కంపించిన ఈశాన్య భారతం.. వణికిపోయిన మిజోరం.. రిక్టర్ స్కేలుపై 5.2 గా నమోదు

| Edited By: Pardhasaradhi Peri

Nov 14, 2020 | 8:25 PM

ప్రజలంతా దీపావళి సంబరాలు జరుపుకుంటున్న వేళ మిజోరం ఒక్కసారిగా వణికిపయింది.

దీపావళి పండుగ వేళ  కంపించిన ఈశాన్య భారతం..  వణికిపోయిన మిజోరం.. రిక్టర్ స్కేలుపై 5.2 గా నమోదు
Follow us on

ప్రజలంతా దీపావళి సంబరాలు జరుపుకుంటున్న వేళ మిజోరం ఒక్కసారిగా వణికిపయింది. రాష్ట్రంలో భూకంపం సంభవించడంత జనం భయభ్రాంతులకు గురయ్యారు. శనివారం మధ్యాహ్నం చంపాయ్ ప్రాంతంలో భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) పేర్కొంది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్టు వెల్లడించారు. ఈ మధ్యాహ్నం 2:20 సమయంలో భూమిలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని ఎన్‌సీఎస్ వెల్లడించింది. చంపాయ్‌కి తూర్పున 119 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రీకృతమైనట్టు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ఘటన కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. పండుగవేళ భూమి కంపంచడంతో మిజోరంవాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గత కొంతకాలంగా ఈశాన్య భారతం వరుస భూకంపాలతో వణికిపోతుంది. అయితే, భారీ వర్షాలు, వాతావరణ మార్పులతో భూకంపాలు సర్వసాధారణమని నిపుణు చెబుతున్నారు.