Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.9గా నమోదైంది. దిగ్లిపూర్కు ఉత్తరంగా 320 కి.మీ.ల దూరంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS)వెల్లడించింది.అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఎన్సీఎస్ పేర్కొంది.
భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఆస్తి నష్టం కూడా సంభవించలేదని అధికారులు తెలిపారు. సముద్రంలో కూడా అలలు ఎగిసిపడటం లేదని వెల్లడించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. భూమి పొరల్లో ఏర్పాడిన చిన్న చిన్న మార్పుల వల్ల ఇలాంటి భూ ప్రకంపనలు వస్తుంటాని తెలిపారు.