నాసిక్‌ ప్రాంతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత

|

Sep 05, 2020 | 12:06 PM

మహారాష్ట్రలో భూప్రకంపనలు వణుకు పుట్టించాయి. నాసిక్‌ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయ్యింది.

నాసిక్‌ ప్రాంతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత
Follow us on

మహారాష్ట్రలో భూప్రకంపనలు వణుకు పుట్టించాయి. నాసిక్‌ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయ్యింది. శుక్రవారం రాత్రి సుమారు 11.41 గంటల సమయంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. అయితే, ఇంతవరకూ ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. అంతకుముందు గత నెలలో మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో కూడా స్వల్పంగా భూకంపం చోటుచేసుకుంది. అప్పుడు కూడా ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. పాల్ఘర్ జిల్లాలో 2.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. గత నెల 26న పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4.1గా నమోదయ్యింది. గత కొద్దినెలలుగా ఈశాన్య భారతంలోనూ భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. కానీ ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.