తజికిస్థాన్‌లో భూకంపం.. రిక్టార్‌ స్కేల్‌పై 6.8గా నమోదు..

| Edited By:

Jun 16, 2020 | 3:49 PM

ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు దేశాలపై ప్రకృతి కూడా కన్నెర్ర చేస్తోంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడితే.. మరికొన్ని చోట్ల భూకంపాలు భయపెడుతున్నాయి.

తజికిస్థాన్‌లో భూకంపం.. రిక్టార్‌ స్కేల్‌పై 6.8గా నమోదు..
Earthquake
Follow us on

ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు దేశాలపై ప్రకృతి కూడా కన్నెర్ర చేస్తోంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడితే.. మరికొన్ని చోట్ల భూకంపాలు భయపెడుతున్నాయి. గడిచిన రెండు మూడు నెలలుగా అనేక దేశాల్లో ఈ పరిస్థితి నెలకొంది. తాజాగా మంగళవారం ఉదయం తజికిస్థాన్‌లో భూకంపం
వచ్చింది. రిక్టార్‌ స్కేల్‌పై 6.8గా నమోదైంది. తజికిస్థాన్‌లోని దశన్బే ప్రాంతానికి  341 కిలోమీటలర్ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. కాగా, ఈ భూప్రకంపనలు మన భారత్‌లోని జమ్ముకశ్మీర్‌లో కూడా తాకాయి. జమ్ముకశ్మీర్‌లో కూడా పలుచోట్ల ఉదయం భూకంపం సంభవించింది.