AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లద్దాఖ్‌, కార్గిల్‌లో భూకంపం.. వారంలో రెండోసారి..

లద్దాఖ్, కార్గిల్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 3.37 గంటల సమయంలో లద్దాఖ్, కార్గిల్‌లో భూకంపం సంభవించింది. దేశ సరిహద్దుల్లోని కార్గిల్ హిమాలయ పర్వత ప్రాంతం కేంద్రంగా భూమి కంపించిందని..

లద్దాఖ్‌, కార్గిల్‌లో భూకంపం.. వారంలో రెండోసారి..
Earthquake
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 05, 2020 | 10:14 AM

Share

లద్దాఖ్, కార్గిల్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 3.37 గంటల సమయంలో లద్దాఖ్, కార్గిల్‌లో భూకంపం సంభవించింది. దేశ సరిహద్దుల్లోని కార్గిల్ హిమాలయ పర్వత ప్రాంతం కేంద్రంగా భూమి కంపించిందని అధికారులు తెలిపారు. ఈ భూకంప తీవ్రత మాగ్నిట్యూడ్‌పై 4.7గా నమోదైంది. కార్గిల్‌కు ఉత్తరాన 433 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. లద్దాఖ్, కార్గిల్ ప్రాంతాల్లో భూమి కంపించిందని సెంటర్ ఫర్ సెస్మాలజీ అధికారులు వెల్లడించారు. గురువారం కూడా కార్గిల్‌లో భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. కాగా లద్దాఖ్‌లో భారత్-చైనా దేశాల మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా భూమి కంపించింది. పంజీన్‌‌కు ఉత్తరాన 683 కిలో మీటర్ల దూరంలో మరో భూకంపం సంభవించింది. దీని తీవ్రత మాగ్నిట్యూట్‌పై 4.4గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం భూమి లోపల 252 కిలోమీటర్ల లోతున ఉందని అధికారులు తెలిపారు.

ప్రపంచానికే దిక్సూచిగా అమరావతి క్వాంటం వ్యాలీ
ప్రపంచానికే దిక్సూచిగా అమరావతి క్వాంటం వ్యాలీ
నేను ఠాకూర్‌ని.. వైరల్‌ వీడియోపై బ్యాంక్‌ ఉద్యోగి క్లారిటీ!
నేను ఠాకూర్‌ని.. వైరల్‌ వీడియోపై బ్యాంక్‌ ఉద్యోగి క్లారిటీ!
ఫోన్‌ పే చేస్తారు...సక్సెస్‌ వస్తుంది..! ట్విస్ట్ ఏంటంటే..
ఫోన్‌ పే చేస్తారు...సక్సెస్‌ వస్తుంది..! ట్విస్ట్ ఏంటంటే..
తన తల్లి జ్ఞాపకార్థంగా ఈ టాలీవుడ్ నటుడు ఏం చేశాడో తెలుసా? ఏకంగా..
తన తల్లి జ్ఞాపకార్థంగా ఈ టాలీవుడ్ నటుడు ఏం చేశాడో తెలుసా? ఏకంగా..
తండ్రి లేని కూతురి పెళ్లి.. సీతాకోకచిలుక రూపంలో వచ్చి ఆశీర్వదించి
తండ్రి లేని కూతురి పెళ్లి.. సీతాకోకచిలుక రూపంలో వచ్చి ఆశీర్వదించి
బాలకృష్ణ నేను క్లాస్ మేట్స్.. సీనియర్ హీరోయిన్ కామెంట్స్..
బాలకృష్ణ నేను క్లాస్ మేట్స్.. సీనియర్ హీరోయిన్ కామెంట్స్..
పెద్దికి బిగ్గెస్ట్ డీల్..NTR క్రేజ్‌కు 140 కోట్లు
పెద్దికి బిగ్గెస్ట్ డీల్..NTR క్రేజ్‌కు 140 కోట్లు
ఆమెకు.. బన్నీ టీం హెచ్చరిక | ప్రభాస్‌ డేట్సే ఇక్కడ ఇష్యూ
ఆమెకు.. బన్నీ టీం హెచ్చరిక | ప్రభాస్‌ డేట్సే ఇక్కడ ఇష్యూ
అబ్బా.. ఏం నటించావ్‌రా.. ఐఏఎస్, ఏపీఎస్ అన్నాడు.. తీరా ఆరా తీస్తే
అబ్బా.. ఏం నటించావ్‌రా.. ఐఏఎస్, ఏపీఎస్ అన్నాడు.. తీరా ఆరా తీస్తే
ఆ సినిమా చేస్తూ చాలా ఏడ్చేశాను.. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి..
ఆ సినిమా చేస్తూ చాలా ఏడ్చేశాను.. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి..