తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రత!

Earth Quake In Telugu States At Night: తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి భూకంపం వచ్చింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన నాగులవంచ, తిమ్మనేనిపాలెం, బసవాపురం, పాతర్లపాడు.. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో అచ్చంపేట, తాళ్లచెరువు, కొత్తపల్లి గ్రామాలలో.. కృష్ణాజిల్లాలోని చందర్లపాడు, కంచికచెర్ల, వీరులపాడు, జగ్గయ్యపేట.. నందిగామ మండలాల్లో అర్ధరాత్రి 2.37 గంటల సమయంలో భూమి 10 సెకెన్ల పాటు కంపించింది. ఇక దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదైంది. ఇంట్లోని వస్తువులు ఒక్కసారిగా కదలడంతో […]

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రత!

Updated on: Jan 26, 2020 | 10:57 AM

Earth Quake In Telugu States At Night: తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి భూకంపం వచ్చింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన నాగులవంచ, తిమ్మనేనిపాలెం, బసవాపురం, పాతర్లపాడు.. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో అచ్చంపేట, తాళ్లచెరువు, కొత్తపల్లి గ్రామాలలో.. కృష్ణాజిల్లాలోని చందర్లపాడు, కంచికచెర్ల, వీరులపాడు, జగ్గయ్యపేట.. నందిగామ మండలాల్లో అర్ధరాత్రి 2.37 గంటల సమయంలో భూమి 10 సెకెన్ల పాటు కంపించింది.

ఇక దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదైంది. ఇంట్లోని వస్తువులు ఒక్కసారిగా కదలడంతో ప్రజలు భయాందోళనలతో బయటికి పరుగులు తీశారు. అయితే ఇవి చిన్న ప్రకంపనలేనని… వీటి వల్ల భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. కాగా, ఐదేళ్ల కిందట రిపబ్లిక్ డే రోజున ఇలాగే ఖమ్మంలోని పాతర్లపాడు, నాగులవంచ గ్రామాల్లో భూమి కంపించింది అక్కడి గ్రామస్థులు చెప్పడం గమనార్హం.