మానవత్వం చాటుకున్న దుబాయ్ రాజు.. వారికి అండగా!

| Edited By:

Jul 30, 2020 | 7:29 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో నైజీరియాకు చెందిన యువతిని ఆర్థికంగా ఆదుకునేందుకు దుబాయి రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ముందుకొచ్చారు.

మానవత్వం చాటుకున్న దుబాయ్ రాజు.. వారికి అండగా!
Follow us on

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో నైజీరియాకు చెందిన యువతిని ఆర్థికంగా ఆదుకునేందుకు దుబాయి రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ముందుకొచ్చారు. సులియత్ అబ్దుల్ కరీమ్(29) అనే మహిళ ఈ నెల ఒకటో తేదీన దుబాయిలోని లతిఫా అనే ఆసుపత్రిలో ఇద్దరు మగపిల్లలకు, ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. మెడికల్ ఇన్సూరెన్స్ కూడా లేకపోవడంతో సులియత్ భర్త టిజానీ అబ్దుల్ కరీమ్ అతి కష్టం మీద లక్షా 8 వేల డాలర్ల(రూ. 80 లక్షల 88 వేలు)ను ఆసుపత్రికి చెల్లించాడు. అయినప్పటికి ఆసుపత్రికి మరింత డబ్బు చెల్లించాల్సి ఉంది.

మరోవైపు.. దుబాయి రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ కు వీరి పరిస్థితి తెలియడంతో.. తాను అండగా నిలుస్తానంటూ భరోసానిచ్చారు. సులియత్‌తో పాటు నలుగురు పిల్లలకు సంబంధించి ఇప్పటివరకు అయిన మొత్తం ఆసుపత్రి ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న సులియత్, ఆమె భర్త టిజానీ ఆనందం వ్యక్తం చేశారు. మెడికల్ ఇన్సూరెన్స్ లేకపోవడంతో తాను నైజీరియా వెళ్లి పిల్లలను కనాలని అనుకున్నట్టు.. అయితే లాక్‌డౌన్ కారణంగా దుబాయిలో చిక్కుకుపోవాల్సి వచ్చినట్టు సులియత్ పేర్కొంది.

Read More:

గుడ్ న్యూస్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 26,778 మెడికల్‌ పోస్టుల భర్తీ!

జీహెచ్​ఎంసీలో మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్​లు.. గంటకు 500 పరీక్షలు..!