హైద‌రాబాద్‌: డ్రగ్స్ కేసులు కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలన్న పిల్ పై హైకోర్టులో విచారణ

|

Dec 17, 2020 | 1:08 PM

డ్ర‌గ్స్ కేసులో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు అప్ప‌గించాల‌న్న పిల్‌పై హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. డ్ర‌గ్స్ కేసుల‌పై హైకోర్టుకు నివేదిక స‌మ‌ర్పించిన ఎక్సైజ్‌శాఖ‌.. 2017లో న‌మోదైన...

హైద‌రాబాద్‌: డ్రగ్స్ కేసులు కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలన్న పిల్ పై హైకోర్టులో విచారణ
Drugs Seized
Follow us on

డ్ర‌గ్స్ కేసులో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు అప్ప‌గించాల‌న్న పిల్‌పై హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. డ్ర‌గ్స్ కేసుల‌పై హైకోర్టుకు నివేదిక స‌మ‌ర్పించిన ఎక్సైజ్‌శాఖ‌.. 2017లో న‌మోదైన 12 డ్ర‌గ్స్ కేసు ద‌ర్యాప్తు పూర్త‌యింద‌ని ఎక్సైజ్ శాఖ హైకోర్టుకు తెలిపింది. 11 ఛార్జ్ షీట్లు దాఖ‌లు చేశామ‌ని, మ‌రో ఛార్జ్ షీట్ త్వ‌ర‌లో వేస్తామ‌ని తెలిపింది. ఈ డ్ర‌గ్స్ కేసుల ద‌ర్యాప్తు చేసే అధికారం కేంద్ర సంస్థ‌ల‌తో పాటు త‌మ‌కూ ఉంద‌ని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇప్ప‌టికే ద‌ర్యాప్తు పూర్త‌యినందున కేంద్ర సంస్థ‌ల‌కు అప్ప‌గించాల్సిన అవ‌స‌రం లేద‌ని అభిప్రాయ‌ప‌డింది.

ఎక్సైజ్ శాఖ త‌మ‌కు డ్ర‌గ్స్ కేసుకు సంబంధించిన వివ‌రాలు ఇవ్వ‌డం లేద‌ని హైకోర్టుకు ఈడీ తెలిపింది. ఛార్జ్ షీట్‌లు, వాగ్మూలాలు ఈడీకి ఇచ్చేలా ఎక్సైజ్ శాఖ‌ను ఆదేశించాల‌ని అద‌న‌పు సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ కోరారు. ఎక్సైజ్ శాఖ నివేదిక‌లో క‌నీస వివ‌రాలు లేవ‌ని వాదించిన న్యాయ‌వాది ర‌చ‌న‌రెడ్డి.. నివేదిక‌పై అభ్యంత‌రాల‌ను స‌మ‌ర్పించేందుకు గ‌డువు ఇవ్వాల‌ని కోరారు. డ్ర‌గ్స్ కేసు విచార‌ణ రెండు వారాల‌కు వాయిదా వేసింది హైకోర్టు.