Driving License Renewal: ఇక సెల్ఫీతో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌..!

Driving License Renewal: వాహనదారులకు శుభవార్త. ఇక ఇంటినుండే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయొచ్చు. ఆన్ లైన్ ద్వారానే అన్ని సేవలను అందించేలా రవాణాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకునే వారు ఆర్టీవో కార్యాలయాలకు రాకుండానే తిరిగి లైసెన్స్ పొందే అవకాశాన్ని కల్పించనున్నారు. కేవలం ఒక్క సెల్పీ దిగి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకుంటే చాలు పని పూర్తైపోతుంది. ఈ నెలాఖరుు నుంచి దీన్ని అమలులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఫ్యాన్సీనంబర్లు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ […]

Driving License Renewal: ఇక సెల్ఫీతో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌..!
Follow us

| Edited By:

Updated on: Feb 17, 2020 | 5:33 PM

Driving License Renewal: వాహనదారులకు శుభవార్త. ఇక ఇంటినుండే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయొచ్చు. ఆన్ లైన్ ద్వారానే అన్ని సేవలను అందించేలా రవాణాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకునే వారు ఆర్టీవో కార్యాలయాలకు రాకుండానే తిరిగి లైసెన్స్ పొందే అవకాశాన్ని కల్పించనున్నారు. కేవలం ఒక్క సెల్పీ దిగి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకుంటే చాలు పని పూర్తైపోతుంది. ఈ నెలాఖరుు నుంచి దీన్ని అమలులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఫ్యాన్సీనంబర్లు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా దక్కించుకునే అవకాశం కల్పించిన రవాణాశాఖ సరికొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది.

మాములుగా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయాలంటే ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాల్సిందే. ఇక ఆ బాధలు తప్పనున్నాయి. దరఖాస్తుదారులు ముందుగా ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించి సెల్ఫీ దిగి రవాణాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. వివరాలను సరిచూసిన తర్వాత అధికారులు రెన్యూవల్‌ చేసిన కార్డును పోస్టు ద్వారా ఇంటికి పంపిస్తారు. దీనికోసం ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ కూడా సిద్ధమైనట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా ఆర్టీవోకు వెళ్లకుండానే కూర్చున్న చోటకే లెసెన్సు తెచ్చుకునే వీలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వారం రోజుల్లోనే ఈ కార్డు ఇంటికి చేరేలా ఏర్పాట్లు కూడా చేశారు. దీంతో రావాణాశాఖలో క్యూలైన్లలో నిల్చునే బాధ వాహనదారులకు తప్పనుంది.