AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భవిష్యత్ యుద్ధాల కోసం స్టార్ వార్స్ తరహా ఆయుధాలకు డీఆర్డీవో ప్లాన్

భారత సైనిక దళాల ఆధునీకరణపై దృష్టి సారించింది. కాలం చెల్లిన ఆయుధాల స్థానంలో భారీ సంఖ్యలో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవాలని సైన్యం గతంలోనే నిర్ణయించింది.

భవిష్యత్ యుద్ధాల కోసం స్టార్ వార్స్ తరహా ఆయుధాలకు డీఆర్డీవో ప్లాన్
Balaraju Goud
|

Updated on: Sep 14, 2020 | 7:28 PM

Share

భారత సైనిక దళాల ఆధునీకరణపై దృష్టి సారించింది. కాలం చెల్లిన ఆయుధాల స్థానంలో భారీ సంఖ్యలో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవాలని సైన్యం గతంలోనే నిర్ణయించింది. విదేశాల నుంచి కాకుండా స్వశక్తితో ఆత్మ నిర్బర భారత్ కార్యక్రమంలో భాగంగా అత్యాధునిక ఆయుధ సంపత్తి పెంచుకునేందుకు భారత రక్షణ శాఖ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఇప్పుడు అత్యాధునిక అధిక శక్తి లేజర్‌లు, అధిక శక్తితో కూడిన మైక్రోవేవ్‌లు వంటి ఇంధన ఆయుధాలపై దృష్టి సారించింది. భవిష్యత్తులో మానవ రహిత యుద్ధాలకు ప్రపంచవ్యాప్తంగా కీలకమైనవిగా పరిగణించబడుతున్నవేళ డీఆర్డీవో ఇందుకు ప్లాన్ చేస్తోంది. దేశీయ పరిశ్రమల సహకారంతో 100 కిలోవాట్ల శక్తి గల వివిధ DEW వేరియంట్‌లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారవర్గాలు తెలిపాయి.

గాలిలోనే క్షిపణులను గాని, విమానాలను గానీ ధ్వంసం చేసే అత్యంత శక్తివంతమైన లేజర్ ఆయుధాలను రూపొందించాలని డీఆర్డీవో సంకల్పిస్తోంది. ఇందులో భాగంగా ‘సాఫ్ట్-కిల్స్’ కోసం ‘కెమికల్ ఆక్సిజన్ అయోడిన్’, ‘హై-పవర్ ఫైబర్’ లేజర్ల నుండి రహస్యమైన ఆయుధం వరకు అనేక డీయూ ప్రాజెక్టులపై DRDO చాలాకాలంగా పనిచేస్తోంది. అయితే, తూర్పు లడఖ్‌లో చైనాతో కొనసాగుతున్న సైనిక ఘర్షణల మధ్య DEW తయారీలపై దృష్టి సారించాల్సిన అవసరం ఇప్పుడు అత్యవసరమైంది.

DRDO ఇప్పటివరకు రెండు యాంటీ-డ్రోన్ DEW వ్యవస్థలను అభివృద్ధి చేసింది. ఇవి ఇప్పుడు పరిశ్రమ సహాయంతో పెద్ద సంఖ్యలో ఉత్పత్తి మొదలు పెట్టాయి. ఒకటి ట్రెయిలర్-మౌంటెడ్ DEW రూపొందించారు ఇది రెండు కిలోమీటర్ల పరిధిలో వైమానిక లక్ష్యాలను 10 కిలోవాట్ల లేజర్‌తో నాశనం చేస్తుంది. మరొకటి కాంపాక్ట్ త్రిపాద-మౌంటెడ్ ఒక కిలోమీటర్ల పరిధిలో 2 కిలోవాట్ల లేజర్‌తో ధ్వంసం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి కార్యకలాపాలలో సాయుధ దళాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, పోలీసు దళాలకు ఈ రెండు వ్యవస్థలు విజయవంతంగా ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. మైక్రో డ్రోన్‌లను తమ కమాండ్ కంట్రోల్ లింక్‌లను జామ్ చేయడం ద్వారా గానీ, లేజర్ ఆధారిత డ్యూ ద్వారా వారి ఎలక్ట్రానిక్‌లను దెబ్బతీయగలవని అధికారులు చెబుతున్నారు.

ఏదేమైనా, బహుళ డ్రోన్లు, యుద్ధనౌకలను నాశనం చేయడానికి యుఎస్, రష్యా, చైనా, జర్మనీ, ఇజ్రాయెల్ వంటి దేశాలు అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన DEW లతో పోలిస్తే ఈ స్వదేశీ వ్యవస్థలు చాలా నిరాడంబరంగా ఉన్నాయంటున్నారు నిపుణులు.

యుఎస్ చాలా సంవత్సరాల క్రితం డ్రోన్లను కూల్చడానికి ఓ యుద్ధనౌక నుండి 33 కిలోవాట్ల లేజర్ ఆయుధాన్ని పరీక్షించింది. ఇటీవల, మే నెలలో, యుఎస్ నావికాదళం లేజర్ వెపన్స్ సిస్టమ్ డిమోన్ స్ట్రేటర్ లో భాగంగా గాలిలో ఎగురుతున్న మావనరహిత విమానాన్ని కొత్త ‘హై-ఎనర్జీ సాలిడ్-స్టేట్ లేజర్’ ద్వారా ధ్వంసం చేసి విజయవంతంగా పరీక్షించింది. వాస్తవానికి, క్రూయిజ్ క్షిపణులను కూల్చగల సామర్థ్యం గల 300 నుండి 500 కిలోవాట్ల డీయూలను మోహరించడానికి యుఎస్ కేవలం నాలుగైదు సంవత్సరాల వ్యవధిలోనే సమకూర్చుకోగలుగుతోంది.

భవిష్యత్ యుద్ధరీతులకు అయా దేశాలు ప్రయోగాలు దర్పణం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మ మొదటి దశలో6-8 కిలోమీటర్ల పరిధిలో ‘చిన్న వైమానిక లక్ష్యాలు’, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ ద్వారా రాడార్ వ్యవస్థలను నాశనం చేయగల ఆయుధాల తయారీ చేయాలని డీఆర్డీవో భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఐఎఎఫ్‌కు కనీసం 20 ‘వ్యూహాత్మక హై-ఎనర్జీ లేజర్ సిస్టమ్స్’ అవసరమని భారత రక్షణ సంస్థ సాంకేతిక రోడ్‌మ్యాప్ ద్వారా పేర్కొంది. రెండవ దశలో లేజర్ వ్యవస్థలు భూమి, వైమానిక వేదికల ద్వారా తేలికపాటి వాహనాల ద్వారా ప్రయోగించేందుకు వీలైన ఆయుధాలను సిద్ధం చేయాలని రక్షణ శాఖ భావిస్తోంది.

అదేవిథంగా బలగాలకు కనీసం 20 అధిక శక్తి విద్యుదయస్కాంత ఆయుధ వ్యవస్థలు అవసరమని రక్షణ శాఖ పేర్కొంది. దీంతో డీఆర్డీవో మొదటి దశలో 6-8 కి.మీ పరిధి రెండో దశలో 15 కి.మీ. పరిధి సామర్థ్యం కలిగిన లేజర్ ఆయుధాలను తయారు చేయాలని డీఆర్డీవో నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. గత నెలలో ఆర్మీ జనరల్ ఎం.ఎం.నారావణె భవిష్యత్ సాధనాలలో భారీగా పెట్టుబడులు పెట్టవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అటువంటి సాంకేంతిక అధునాతన శక్తివంతమైన ఆయుధాలు కార్యాచరణలో రియాలిటీగా మారడానికి చాలా సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.