నిరుద్యోగులకు గుడ్ న్యూస్.డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. డీఆర్‌డీఓకు చెందిన ల్యాబ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబరేటరీ (DRDL)లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టులను భర్తీ చేస్తున్నది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జూన్ 14చివరి తేదీ. ఇందులో మొత్తం 10 ఖాళీలున్నాయి. ఆఫ్‌లైన్ అప్లికేషన్లను వచ్చేనెల 14లోపు పంపించాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 10
అర్హతలు: జేఆర్ఎఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ పోస్టుకు మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ పోస్టుకు సంబంధిత బ్రాంచీలో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత సాధించాలి. గేట్ స్కోర్ తప్పనిసరి.
అభ్యర్థుల వయసు: 28 ఏండ్లలో…
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 14
ఖాళీలు: ఇందులో మెకానికల్ ఇంజినీరింగ్ 7, ఏరోనాటికల్ లేదా ఏరో స్పేస్ ఇంజనీరింగ్ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
వేతనం: రూ.31,000
దరఖాస్తు విధానం: నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తిగా నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి సంబంధిత అడ్రస్‌కు పోస్టుల్ ద్వారా దరఖాస్తును పంపించాలి.
దరఖాస్తు పంపించాల్సిన అడ్రస్: The Director, DRDL, Dr. APJ Abdul Kalam Missile Complex, Kanchanbagh PO, Hyderabad – 500058