ట్రంప్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగులు స్థానికులకే..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపాథి కోసం వెళ్లే విదేశీలకు షాక్ ఇచ్చారు. అమెరికా ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న విదేశీయులకు స్వస్తి పలకనున్నారు. ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో అమెరికన్లను మాత్రమే నియమించుకునేలా కొత్త నిబంధనలను తీసుకొచ్చారు.

ట్రంప్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగులు స్థానికులకే..!
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 04, 2020 | 1:19 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపాథి కోసం వెళ్లే విదేశీలకు షాక్ ఇచ్చారు. అమెరికా ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న విదేశీయులకు స్వస్తి పలకనున్నారు. ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో అమెరికన్లను మాత్రమే నియమించుకునేలా కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. అమెరికా పౌరులు, గ్రీన్‌కార్డుదారులను కాంట్రాక్టు కొలువుల నుంచి తీసివేయకూడదని స్పష్టం చేశారు. ఈ మేరకు సంబంధిత కార్యనిర్వహణ ఉత్తర్వులపై ట్రంప్‌ సోమవారం సంతకాలు చేశారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్లకు తిరిగి ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైట్ హౌజ్ వర్గాలు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా లాక్ డౌన్ కారణంగా అమెరికా వ్యాప్తంగా ఉపాధి కోల్పోయి నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. ఇటు ప్రభుత్వ తిరిగి ఉద్యోగ కల్పనకు కృషీ చేస్తూనే, కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాల్లోనూ నిబంధనలు కఠినతరం చేసింది అగ్రరాజ్యం.