‘చైనీస్ ఆక్రమణల’ డాక్యుమెంట్ ఏదీ ? ఎక్కడ ?

భారత-చైనా దేశాల మధ్య కయ్యం నేపథ్యంలో రక్షణ శాఖ వెబ్ సైట్ లో కీలకమైన ఓ డాక్యుమెంట్ మిస్సయింది. ఇది తమ సైట్ లోని న్యూస్ సెక్షన్ లో కనిపించకుండా..

'చైనీస్ ఆక్రమణల' డాక్యుమెంట్ ఏదీ ? ఎక్కడ ?
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 06, 2020 | 5:02 PM

భారత-చైనా దేశాల మధ్య కయ్యం నేపథ్యంలో రక్షణ శాఖ వెబ్ సైట్ లో కీలకమైన ఓ డాక్యుమెంట్ మిస్సయింది. ఇది తమ సైట్ లోని న్యూస్ సెక్షన్ లో కనిపించకుండా పోయిందని డిఫెన్స్ మినిస్ట్రీ అంగీకరించింది. కేవలం రెండు రోజుల క్రితమే సైట్ లో ఉంచిన ఈ డాక్యుమెంట్ మిస్ కావడం మిస్టరీగా మారింది. గత మే నెల 5 నుంచి లడాఖ్ లోని  వాస్తవాధీన రేఖ  పొడవునా చైనా ఆక్రమణ పెరుగుతూ వచ్చిందని, కుంగ్ రాంగ్ నాలా, గోగ్రా, పాంగాంగ్ సో సరస్సు ప్రాంతాల్లో మే 17,18 తేదీల్లో చైనా దళాల సంఖ్య హెచ్చిందని ‘చైనీస్ అగ్రెషన్ ఆన్ ఎల్ ఏసీ ‘ టైటిల్ పేరిట ఓ డాక్యుమెంట్ ని ఈ సైట్ లో ఉంచారు. అలాగే భారత-చైనా దేశాల మధ్య కమాండర్ల స్థాయిలో జరిగిన చర్చలను కూడా ఇందులో ప్రస్తావించారు.

ఇంత అతి ముఖ్యమైన ‘ప్రతి’ వెబ్ సైట్ నుంచి మిస్ కావడం, లింక్ కూడా పని చేయకపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. రక్షణ శాఖలోని ప్రతినిధి ఒకరయితే..ఈ డాక్యుమెంట్ గురించి తనకు ఏమీ తెలియదంటున్నారు. ఇలా కావడం ఇదే మొట్టమొదటిసారి. కాగా ‘డిలిట్’ చేసిన డాక్యుమెంట్ కు సంబంధించి వఛ్చిన వార్తపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘మరి ప్రధాని ఎందుకు అబధ్ధమాడుతున్నారని’ ప్రశ్నించారు.భారత రక్షణ శాఖ వెబ్ సైట్ లోనే ఇలా కీలక డాక్యుమెంట్…. అందులోనూ ఈ తరుణంలో కనబడకుండా పోవడం ఏమిటో అర్థం కాకుండా ఉందని అంటున్నారు.