ధోని వరల్డ్ రికార్డు బ్రేక్…

భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని వన్డేల్లో నెలకొల్పిన ఓ ప్రపంచ రికార్డును ఇంగ్లాండ్ సారధి ఇయాన్ మోర్గాన్ బద్దలు కొట్టాడు.

ధోని వరల్డ్ రికార్డు బ్రేక్...

Dhoni World Record Break: భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని వన్డేల్లో నెలకొల్పిన ఓ ప్రపంచ రికార్డును ఇంగ్లాండ్ సారధి ఇయాన్ మోర్గాన్ బద్దలు కొట్టాడు. కెప్టెన్ల జాబితాలో అత్యధిక సిక్సర్లు(211) కొట్టిన ఆటగాడిగా ధోని రికార్డుల్లోకి ఎక్కగా.. తాజాగా ఆ రికార్డును మోర్గాన్ అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో మోర్గాన్ ఈ ఫీట్ సాధించడం విశేషం.

ప్రస్తుతం అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్ల జాబితాలో అగ్రస్థానంలో మోర్గాన్ నిలవగా.. ఆ తర్వాత ధోని(211), ఆస్ట్రేలియా మాజీ సారధి రికీ పాంటింగ్(171), బ్రెండన్ మెక్‌కలమ్‌(170) వరుసగా ఉన్నారు. ఇక మోర్గాన్ 211 సిక్సర్ల మార్క్‌ను కేవలం 163 మ్యాచ్‌ల్లోనే రీచ్ కాగా.. ధోని 332 మ్యాచ్‌లతో అందుకున్నాడు. అటు మూడు ఫార్మాట్లలోనూ అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల లిస్టు ఒకసారి చూస్తే.. క్రిస్‌ గేల్(534), షాహిద్‌ అఫ్రిదీ( 476)లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక మోర్గాన్(328) ధోని(359) కంటే 31 సిక్సర్లు తక్కువలో ఉండగా.. త్వరలోనే ఈ రికార్డును కూడా బ్రేక్ చేసేందుకు సిద్దమయ్యాడు.

Click on your DTH Provider to Add TV9 Telugu