Hyderabad: కిడ్నీలో 156 రాళ్లు.. 350 గ్రాములకు పైనే బరువు.. విజయవంతంగా తొలగించిన హైదరాబాద్‌ వైద్యులు..

మనిషిలో ఉండే కిడ్నీ బరువు కంటే ఎక్కువ బరువు ఉన్న రాళ్లు తయారైతే ఏమవుతుంది? కిడ్నీలో ఒక చిన్న రాయి ఉంది అని తెలిస్తేనే గుండె గుభేలు మంటుంది.

Hyderabad: కిడ్నీలో 156 రాళ్లు.. 350 గ్రాములకు పైనే బరువు.. విజయవంతంగా తొలగించిన హైదరాబాద్‌ వైద్యులు..

Updated on: Dec 17, 2021 | 8:28 AM

మనిషిలో ఉండే కిడ్నీ బరువు కంటే ఎక్కువ బరువు ఉన్న రాళ్లు తయారైతే ఏమవుతుంది? కిడ్నీలో ఒక చిన్న రాయి ఉంది అని తెలిస్తేనే గుండె గుభేలు మంటుంది. అటువంటిది.. ఏకంగా 156 రాళ్లున్నాయంటే.. ఆ పేషెంట్ పరిస్థితి ఏమిటి? కానీ, హైదరాబాద్ వైద్యులు అటువంటి పేషెంట్ ను ప్రమాదం నుంచి బయటపడేశారు. ఈ కిడ్నీ రాళ్ల విషయం ఇప్పుడు సంచలనంగా మారింది..కర్ణాటకలోని హుబ్లీకి చెందిన బసవరాజ్‌ మడివలార్‌ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలోనే ఆయనకు శస్త్రచికిత్సచేసి కిడ్నీలో రాళ్లు తొలగించారు. అయితే ఇటీవల కడుపులో మళ్లీ భరించలేని నొప్పి రావడంతో స్కానింగ్‌ తీయించుకున్నాడు. కుడివైపు కిడ్నీలో కూడా రాళ్లు ఉన్నాయని అందులో తేలింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 350 గ్రాముల బరువున్న 156 రాళ్లు ఉన్నాయని స్కానింగ్‌లో తేలింది.

ఈ క్రమంలో దేశంలోనే మొట్టమొదటి సారిగా పెద్ద ఆపరేషన్‌ చేయకుండా కేవలం ల్యాప్రోస్కోపీ, ఎండోస్కోపీలతోనే కీ హోల్‌ సర్జరీ నిర్వహించి కిడ్నీలో ఉన్న ఈ156 రాళ్లను విజయవంతంగా తొలగించారు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ యూరాలజిస్ట్‌ డాక్టర్‌ చంద్రమోహన్‌. ఈమేరకు గురువారం సర్జరీ విషయాలను వెల్లడించారు. ‘సాధారణంగా మూత్రకోశం సమీపంలో కిడ్నీ ఉంటుంది. అయితే అయితే బసవరాజ్‌కు మాత్రం పొట్ట సమీపంలో కిడ్నీ ఉంది. దీనిని ఎక్టోపిక్‌ కిడ్నీ అంటారు. ఇలాంటివారికి కిడ్నీలో రాళ్లను తీయడం ఎంతో సంక్లిష్టతతో కూడుకున్నది. కడుపుపై కోత లేకుండా కేవలం కీహోల్‌ సర్జరీ మాత్రమే చేసి రాళ్లను తీసేశాం. మొదట పెద్ద రాయిని తీశాం. ఆతర్వాత దాని కింద ఉన్న చిన్న చిన్న రాళ్లను తొలగించాం. ఈ పేషెంట్‌కు రెండేళ్లకు ముందే కిడ్నీలో రాళ్లు ఏర్పడటం మొదలయ్యాయి. అయితే అతనికి ఎలాంటి లక్షణాలు కన్పించలేదు. ఉన్నట్టుండి కడుపులో నొప్పి రావడంతో పరీక్షలు చేయించుకుంటే అసలు విషయం తెలిసింది. సర్జరీ విజయవంతంగా ముగిసింది. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు’ అని డాక్టర్‌ చెప్పుకొచ్చారు.

Also Read:

Dating Apps: వేగంగా విస్తరిస్తోన్న డేటింగ్ సంస్కృతి.. టాప్‌లో హైదరాబాద్‌.. సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలు..

Covid Omicron: తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్‌ కేసులు.. హైదరాబాద్‌లో అధికారుల హై అలర్ట్..

Telangana: రేపు కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ సంయుక్త సమావేశం.. చర్చకు రానున్న అంశాలివేనా?