ఎన్‌హెచ్‌ఆర్సీని కలవనున్న దిశ పేరంట్స్..! మహిళలకు నైట్‌ షిఫ్ట్స్ వద్దు..!

| Edited By: Srinu

Dec 09, 2019 | 1:59 PM

దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు హైకోర్టు విచారణ జరగనుంది. పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్ చేస్తారని మహిళా సంఘాలు కోర్టులో పిటిషన్ వేశాయి. కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో.. నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడాన్ని మహిళా సంఘాలు తప్పుబడ్డాయి. మృత దేహాలు అప్పగించే వ్యవహారంపై కూడా న్యాయ స్థానం.. ఇవాళ నిర్ణయం తీసుకోనుంది. కాగా.. మరోవైపు ఈ రోజు దిశ […]

ఎన్‌హెచ్‌ఆర్సీని కలవనున్న దిశ పేరంట్స్..! మహిళలకు నైట్‌ షిఫ్ట్స్ వద్దు..!
Follow us on

దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు హైకోర్టు విచారణ జరగనుంది. పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్ చేస్తారని మహిళా సంఘాలు కోర్టులో పిటిషన్ వేశాయి. కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో.. నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడాన్ని మహిళా సంఘాలు తప్పుబడ్డాయి. మృత దేహాలు అప్పగించే వ్యవహారంపై కూడా న్యాయ స్థానం.. ఇవాళ నిర్ణయం తీసుకోనుంది.

కాగా.. మరోవైపు ఈ రోజు దిశ కుటుంబసభ్యులు జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందాన్ని కలవనున్నారు. ‘దిశ’ పనిచేసిన వెటర్నరీ ఆస్పత్రిలో మహిళా వైద్యులకు నైట్ షిఫ్ట్స్ రద్దు చేయాలని కోరనున్నారు. అలాగే.. దిశ చెల్లెలు.. భవ్యా రెడ్డికి కూడా.. భద్రత దృష్ట్యా నైట్ షిఫ్ట్ రద్దు చేసిన శంషాబాద్‌ ఎయిర్ పోర్టు అధికారులు. బదిలీ లేకుండా చూడాలని దిశ తండ్రి అధికారులను విజ్ఞప్తి చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఏటీసీ జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది భవ్యా రెడ్డి. కాగా.. ఆదివారం.. ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు.. నిందితుల ఎన్‌కౌంటర్‌పై దిశ కుటుంబసభ్యులను.. కాలనీ వారిని.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.