మున్సిపల్ చట్టం పై.. నేడు తెలంగాణ ఉభయసభల్లో చర్చ

| Edited By:

Jul 19, 2019 | 8:21 AM

నేడు తెలంగాణ ఉభయసభల్లో నూతన మున్సిపల్ చట్టం పై చర్చ జరపనున్నారు. ఆదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. ఇక మధ్యాహ్నం 2 గంటలకు శాసనమండలి ప్రారంభం కానుంది. కాగా నిన్న జరిగిన శాసనసభలో నూతన మున్సిపల్ బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. దాంతో పాటు వార్డుల విభజనకు సంబంధించి మున్సిపల్ నిబంధనల సవరణ, పంచాయితీరాజ్ చట్ట సవరణ, వైద్య విద్యా కళాశాలల్లో ప్రొఫెసర్ల వయోపరిమితి పెంపు, తెలంగాణ రుణ విమోచన కమిషన్ సవరణ బిల్లులను […]

మున్సిపల్ చట్టం పై.. నేడు తెలంగాణ ఉభయసభల్లో చర్చ
Follow us on

నేడు తెలంగాణ ఉభయసభల్లో నూతన మున్సిపల్ చట్టం పై చర్చ జరపనున్నారు. ఆదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. ఇక మధ్యాహ్నం 2 గంటలకు శాసనమండలి ప్రారంభం కానుంది. కాగా నిన్న జరిగిన శాసనసభలో నూతన మున్సిపల్ బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. దాంతో పాటు వార్డుల విభజనకు సంబంధించి మున్సిపల్ నిబంధనల సవరణ, పంచాయితీరాజ్ చట్ట సవరణ, వైద్య విద్యా కళాశాలల్లో ప్రొఫెసర్ల వయోపరిమితి పెంపు, తెలంగాణ రుణ విమోచన కమిషన్ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. అభివృద్ధి సక్రమంగా జరగడానికే నూతన మున్సిపల్ చట్టం తీసుకొస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికలను సకాలంలో నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను 142 కు పెంచామని వివరించారు. అసెంబ్లీలో మున్సిపల్ నిబంధనల సవరణ బిల్లును బిల్లును ఆయన ప్రవేశపెట్టారు.