నిత్యం సీరియస్‌గా పాలిటిక్స్.. సిన్సియర్‌గా అడ్మినిస్ట్రేషన్ చూసుకునే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మునిసిపల్ మంత్రి కేటీఆర్‌లో మరో కోణం మంగళవారం ఉదయం వెల్లడైంది. చాలా సీరియస్‌గా కనిపించే కేటీఆర్ మంగళవారం తెల్లవారుజామున చేసిన ఓ ట్వీట్ ఆయనలోని మరో కోణాన్ని వెల్లడించింది. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వరల్డ్ ఎకానమిక్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు వెళ్ళిన కేటీఆర్ తనలోని మరో కోణాన్ని ట్వీట్ ద్వారా ప్రకటించారు.
Jet lagged & up at 3:30 am Swiss time!
‘Samaja Varagamana’ on my playlist keeping me company. What a brilliant song!! @MusicThaman you’ve outdone yourself ? Cant get this one out of my head ? pic.twitter.com/lUGsopHlT0
— KTR (@KTRTRS) January 21, 2020
హైదరాబాద్ నుంచి దావోస్ వెళ్ళిన తాను ప్రస్తుతం జెట్ లాగ్‌లో వున్నానంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు. జెట్ లాగ్‌తో బోర్ కొడుతుందన్నారాయన. నిద్ర కూడా పట్టకపోవడంతో ఇటీవల విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్న అల..వైకుంఠపురంలో.. సినిమాలోని సాంగ్ వింటున్నానన్నారు. సామజవరగమనా.. పాట అద్భుతంగా వుందంటూ తనలోని సంగీత స్పృహను చాటుకున్నారు కేటీఆర్. ఆ పాటకు సంగీతం సమకూర్చిన ఎస్.ఎస్.తమన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు కేటీఆర్. ఈ రకంగా కేటీఆర్ తనలోకి మరో కోణాన్ని మంగళవారం ఆవిష్కరించారు.