హేమమాలినిపై ధర్మేంద్ర కామెంట్!

| Edited By:

Jul 16, 2019 | 12:00 AM

ప్రఖ్యాత సినీ నటి, మధుర ఎంపీ హేమమాలిని ఇటీవల పార్లమెంట్ ఆవరణలో చీపురుపట్టి శుభ్రం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు కూడా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అత్యంత శుభ్రంగా ఉండే పార్లమెంటు ఆవరణలో శుభ్రం చేయడం ఏంటంటూ విమర్శలతో విరుచుకుపడుతున్నారు. దీనిపై ధర్మేంద్ర కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘సర్ మేడం ఎప్పుడైనా ఇంట్లో చీపురు పట్టారా?’’ అని ఓ నెటిజన్ ధర్మేంద్రను ప్రశ్నించాడు. దీనికి ధర్మేంద్ర నిజాయతీగా బదులిచ్చాడు. ఆమె సినిమాల్లో […]

హేమమాలినిపై ధర్మేంద్ర కామెంట్!
Follow us on

ప్రఖ్యాత సినీ నటి, మధుర ఎంపీ హేమమాలిని ఇటీవల పార్లమెంట్ ఆవరణలో చీపురుపట్టి శుభ్రం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు కూడా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అత్యంత శుభ్రంగా ఉండే పార్లమెంటు ఆవరణలో శుభ్రం చేయడం ఏంటంటూ విమర్శలతో విరుచుకుపడుతున్నారు. దీనిపై ధర్మేంద్ర కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘సర్ మేడం ఎప్పుడైనా ఇంట్లో చీపురు పట్టారా?’’ అని ఓ నెటిజన్ ధర్మేంద్రను ప్రశ్నించాడు. దీనికి ధర్మేంద్ర నిజాయతీగా బదులిచ్చాడు. ఆమె సినిమాల్లో మాత్రమే చీపురు పడుతుందని చెప్పుకొచ్చాడు. తానైతే చీపురపట్టి ఉడ్చడంలో చిన్నప్పటి నుంచే స్పెషలిస్టునని పేర్కొన్నాడు. తానెప్పుడూ అమ్మ చేతిని పట్టుకునే ఉండేవాడనని గుర్తు చేసుకున్నాడు. శుభ్రతను తాను ఇష్టపడతానని ధర్మేంద్ర బదులిచ్చాడు.