రాజధాని రగడ..పెద్దిరెడ్డి వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యంః దేవినేని ఉమా

|

Dec 20, 2019 | 6:56 PM

ఏపీలో మూడు రాజధానుల అంశం రాజకీయంగా కాకరేపుతోంది. ఈనేపధ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన కామెంట్స్‌ మరింత దుమారం రేపుతున్నాయి. రాజధానికోసం రైతులిచ్చిన 33వేల ఎకరాల భూములను తిరిగి రైతులకే ఇచ్చేస్తున్నామని….మూడు కాకుంటే 30 రాజధానులు పెట్టుకుంటామంటూ పెద్దిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కమిటీ రిపోర్ట్ రాకముందే అధికారపార్టీ అత్యుత్సాహానికి పోతోందంటూ టీడీపీ మండిపడుతోంది. ఈ క్రమంలోనే ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పెద్దిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. […]

రాజధాని రగడ..పెద్దిరెడ్డి వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యంః దేవినేని ఉమా
Follow us on

ఏపీలో మూడు రాజధానుల అంశం రాజకీయంగా కాకరేపుతోంది. ఈనేపధ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన కామెంట్స్‌ మరింత దుమారం రేపుతున్నాయి. రాజధానికోసం రైతులిచ్చిన 33వేల ఎకరాల భూములను తిరిగి రైతులకే ఇచ్చేస్తున్నామని….మూడు కాకుంటే 30 రాజధానులు పెట్టుకుంటామంటూ పెద్దిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కమిటీ రిపోర్ట్ రాకముందే అధికారపార్టీ అత్యుత్సాహానికి పోతోందంటూ టీడీపీ మండిపడుతోంది. ఈ క్రమంలోనే ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పెద్దిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజధాని రైతులకు భూములు తిరిగి ఇచ్చేస్తామన్న మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యమని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. విశాఖ పరిసరాల్లో 6 వేల ఎకరాలను వైసీపీ నాయకులు తమ అధీనంలో ఉంచుకున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపితే వాస్తవాలు బయటకొస్తాయన్నారు. ఆరు నెలలుగా విజయసాయిరెడ్డి విశాఖలో ఎవరిని కలిశారని దేవినేని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దక్షిణాఫ్రికాతో ఎలా పోలుస్తారని నిలదీశారు. 30 వేల ఎకరాల్లో రాజధాని కావాలని జగన్‌ గతంలో అన్నారని గుర్తు చేశారు. రాజధానిపై మంత్రుల వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యమని వ్యాఖ్యనించారు.