ఇకపై వైసీపీ నేత అవినాశ్..ఆ పదవి కన్ఫామా…?

|

Nov 14, 2019 | 8:27 PM

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు వైసీపీ మంచి జోష్‌తో ముందకు సాగుతుంటే, టీడీపీ మాత్రం ఎన్నడూ ఊహించని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా బీజేపీ, వైసీపీల వైపు క్యూ కడుతున్నారు. తాజాగా దివంగత దేవినేని నెహ్రూ తనయుడు అవినాశ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం అవినాశ్.. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. […]

ఇకపై వైసీపీ నేత అవినాశ్..ఆ పదవి కన్ఫామా...?
Follow us on

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు వైసీపీ మంచి జోష్‌తో ముందకు సాగుతుంటే, టీడీపీ మాత్రం ఎన్నడూ ఊహించని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా బీజేపీ, వైసీపీల వైపు క్యూ కడుతున్నారు. తాజాగా దివంగత దేవినేని నెహ్రూ తనయుడు అవినాశ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం అవినాశ్.. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తాజాగా జగన్‌..అవినాశ్‌ను పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు.  మరో సీనియర్ నేత బుచ్చిబాబు సైతం వైసీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నప్పటికి..టీడీపీ అధినేత నుంచి సరైన గుర్తింపు రాకపోవడమే పార్టీ మార్పుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

కాగా విజయవాడ సిటీలో తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నుంచి  గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పశ్చిమ, సెంట్రల్‌లో వైసీపీ పాగా వేసింది. గద్దె రామ్మెహన్‌కు చెక్ పెట్టేందుకు వైసీపీ..అవినాశ్‌ను రంగంలోకి దింపబోతున్నట్టు సమాచారం. వైసీపీ విజయవాడ తూర్పు బాధ్యతలు దేవినేని కుటుబం నుంచి వచ్చిన ఈ యువనేతకు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.