ఐదేళ్ల కష్టానికి ప్రజలిచ్చిన గిఫ్ట్ ఇది..

మంగళవారం లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రత్యేక ప్రసంగం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెల్పిన మోదీ.. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన స్పీకర్.. ఓం బిర్లా సమర్థవంతంగా బాధ్యత నిర్వర్తిస్తున్నారని అన్నారు. ప్రజలు మాకు మరోసారి అవకాశం ఇచ్చారని.. ప్రజల తీర్పును గర్వకారణంగా భావిస్తున్నామని అన్నారు. ఇంత స్పష్టమైన తీర్పు గతంలో ఎప్పుడూ రాలేదన్న ఆయన.. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామని స్పష్టం చేశారు. ఓటర్లు దైవసమానులన్న మోదీ.. ఐదేళ్ల కష్టానికి దేశ ప్రజలు మా ప్రభుత్వానికి […]

ఐదేళ్ల కష్టానికి ప్రజలిచ్చిన గిఫ్ట్ ఇది..

Edited By:

Updated on: Jun 25, 2019 | 6:06 PM

మంగళవారం లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రత్యేక ప్రసంగం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెల్పిన మోదీ.. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన స్పీకర్.. ఓం బిర్లా సమర్థవంతంగా బాధ్యత నిర్వర్తిస్తున్నారని అన్నారు. ప్రజలు మాకు మరోసారి అవకాశం ఇచ్చారని.. ప్రజల తీర్పును గర్వకారణంగా భావిస్తున్నామని అన్నారు. ఇంత స్పష్టమైన తీర్పు గతంలో ఎప్పుడూ రాలేదన్న ఆయన.. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామని స్పష్టం చేశారు. ఓటర్లు దైవసమానులన్న మోదీ.. ఐదేళ్ల కష్టానికి దేశ ప్రజలు మా ప్రభుత్వానికి ఇచ్చిన బహుమతి ఈ విజయమన్నారు. సామాన్యుల హక్కులు కాపాడటం మా ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమన్న ఆయన.. దేశ ప్రజల్లో ఆత్మ విశ్వాసం నింపామని.. రోడ్ల నుంచి రోదసీ వరకు అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించాలని అన్నారు.