AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడపిల్లల భవిష్యత్ కోసం అద్భుత స్కీమ్..అప్లై చేశారా..?

ఆడపిల్లల భవిష్యత్ బంగారుమయం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2015లో సుకన్య సమృద్ది యోజన పథకాన్ని ప్రారంభించింది. ఆడపిల్లల తల్లిదండ్రులు రూ.250 నుంచి..రూ.1,50,000 వరకు ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేయవచ్చు. ఒక ఇంట్లో ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నా.. సుకన్య స్కీమ్‌కు అర్హులవుతారు. అయితే ఒక్కోసారి కవల పిల్లలు పుట్టిన నేపథ్యంలో గరిష్ఠంగా ఒక కుటుంబం నుంచి ముగ్గురు ఆడపిల్లలు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందవచ్చు. సాధారణ పొదుపు పథకాల కంటే సుకన్య స్కీమ్‌కు చాలా […]

ఆడపిల్లల భవిష్యత్ కోసం అద్భుత స్కీమ్..అప్లై చేశారా..?
Ram Naramaneni
|

Updated on: Nov 17, 2019 | 4:04 PM

Share

ఆడపిల్లల భవిష్యత్ బంగారుమయం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2015లో సుకన్య సమృద్ది యోజన పథకాన్ని ప్రారంభించింది. ఆడపిల్లల తల్లిదండ్రులు రూ.250 నుంచి..రూ.1,50,000 వరకు ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేయవచ్చు. ఒక ఇంట్లో ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నా.. సుకన్య స్కీమ్‌కు అర్హులవుతారు. అయితే ఒక్కోసారి కవల పిల్లలు పుట్టిన నేపథ్యంలో గరిష్ఠంగా ఒక కుటుంబం నుంచి ముగ్గురు ఆడపిల్లలు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందవచ్చు. సాధారణ పొదుపు పథకాల కంటే సుకన్య స్కీమ్‌కు చాలా ఎక్కువ వడ్డీని బ్యాంకులు జమచేస్తాయి. సదరు ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత అకౌంట్‌లో ఉన్న మొత్తంలో 50 శాతం..వారి హైయ్యర్ స్టడీస్ కోసం, మ్యారేజ్ కోసం విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. 21 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి నగదును తీసుకునే సౌలభ్యం ఉంది.

  • గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ప్రవేట్ బ్యాంకుల్లో సుకన్య ఖాతాను తెరవవచ్చు
  • 10 సంవత్సరాల లోపు ఉన్న బాలికలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడు బాలికల తరఫున ఈ ఖాాతాను తెరవవచ్చు.
  • అకౌంట్ ఓపెన్ చేసిన తారీఖు నుంచి 21 సంవత్సరాలు యాక్టివ్‌లో ఉంటుంది. అలా ప్రతి ఏడాది నిర్ణీత అమౌంటును 15 ఏళ్ల పాటు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఖాతా.. 21 సంవత్సరాల కాలపరిమితి ముగియకముందే సభ్యురాలు మ్యారేజ్ చేసుకుంటే..అకౌంట్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతుంది.
  • తాజా రూల్స్ ప్రకారం ఈ ఖాతాలకు 8. 4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.
  • సుకన్య ఖాతాపై సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.