కొనసాగుతున్న ‘ప్రజావేదిక’ కూల్చివేత పనులు..

| Edited By: Srinu

Jun 27, 2019 | 8:15 PM

నేడూ ప్రజావేదిక కూల్చివేత పనులు కొనసాగనున్నాయి. నిన్నటి వరకూ 70 శాతం ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ పూర్తవగా.. రెండో రోజు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా ఉండవల్లి ప్రజా వేదిక దగ్గర టెన్షన్ టెన్షన్ వాతావరణం కనిపించినా.. ఇవాళ చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. నిన్నంతా జేసీబీలతో ప్రజా వేదిక కూల్చివేత పనులు ముమ్మరంగా జరిగాయి. దాదాపు ప్రజావేదిక కూల్చివేత అయిపోవచ్చింది అన్నారు. మధ్యాహ్నం వరకే ప్రజావేదికను కూల్చివేత ప్రక్రియను పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. అయితే.. ప్రజావేదిక వస్తులను […]

కొనసాగుతున్న ప్రజావేదిక కూల్చివేత పనులు..
Follow us on

నేడూ ప్రజావేదిక కూల్చివేత పనులు కొనసాగనున్నాయి. నిన్నటి వరకూ 70 శాతం ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ పూర్తవగా.. రెండో రోజు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా ఉండవల్లి ప్రజా వేదిక దగ్గర టెన్షన్ టెన్షన్ వాతావరణం కనిపించినా.. ఇవాళ చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. నిన్నంతా జేసీబీలతో ప్రజా వేదిక కూల్చివేత పనులు ముమ్మరంగా జరిగాయి. దాదాపు ప్రజావేదిక కూల్చివేత అయిపోవచ్చింది అన్నారు. మధ్యాహ్నం వరకే ప్రజావేదికను కూల్చివేత ప్రక్రియను పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. అయితే.. ప్రజావేదిక వస్తులను తిరిగి ఉపయోగించుకునే విధంగా తొలగిస్తున్నామని అందుకే ఆలస్యమయిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే.. ఇంకా కేవలం ప్రజావేదిక పైకప్పు మాత్రమే ఉందని.. అది తొలగిస్తే ప్రజావేదిక కూల్చివేత పూర్తవుతుందని తెలిపారు.