చలికి గజగజ వణకుతున్న ఢిల్లీ, 2 డిగ్రీల కనిష్ఠ స్థాయికి దిగజారనున్న ఉష్ణోగ్రతలు, మరో రెండు రోజులు ఇదే పరిస్థితి అంటున్న నిపుణులు

ఉత్తరాదిలో ముఖ్యంగా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి.  రాత్రి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోయినట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది.

చలికి గజగజ వణకుతున్న ఢిల్లీ, 2 డిగ్రీల కనిష్ఠ స్థాయికి దిగజారనున్న ఉష్ణోగ్రతలు, మరో రెండు రోజులు ఇదే పరిస్థితి అంటున్న నిపుణులు
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Dec 29, 2020 | 9:46 PM

ఉత్తరాదిలో ముఖ్యంగా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి.  రాత్రి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోయినట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. హిమాలయాలు, ఉత్తరాది ప్రాంతాలనుంచి వస్తున్న శీతల గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మంగళవారం ఈ నగరంలో కేవలం 3.2 డిగ్రీల  సెల్సియస్ గా నమోదైనట్టు ఈ  శాఖ వెల్లడించింది., ఉత్తరాఖండ్, . హర్యానా, పంజాబ్, యూపీ, బీహార్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలన్నీ చలికి గజగజలాడుతున్నాయి.  బుధ,గురు వారాల్లో ఢిల్లీలో రెండు  కన్నా తక్కువ టెంపరేచర్ నమోదైనా ఆశ్చర్యం లేదంటున్నారు. రాజస్థాన్ లోని చురులో మంగళవారం మైనస్ 0.4 డిగ్రీల టెంపరేచర్ నమోదయింది. ఈ వాతావరణ మార్పుల కారణంగా పొగమంచు కూడా దట్టంగా కమ్ముకుంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఈ శీతా కాలంలో ప్రజలు చాలావరకు ఇళ్లలోనే ఉండాలని, జలుబు, ఫ్లూ వంటి రుగ్మతలు సోకుతాయని డాక్టర్లు హెచ్ఛరిస్తున్నారు. బయటకు వెళ్లే ముందు వెచ్చ్చని దుస్తులు ధరించాలని  వారు సూచిస్తున్నారు.