AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ గవర్నర్ బంగ్లాలో కరోనా కలవరం..!

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో 13 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ. మరో ఆరుగురు ప్రభుత్వ అధికారులకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేల్చిన అధిెకారులు

ఢిల్లీ గవర్నర్ బంగ్లాలో కరోనా కలవరం..!
Balaraju Goud
|

Updated on: Jun 02, 2020 | 6:15 PM

Share

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ కార్యాలయంలోని 13 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. వారితో పాటు మరో ఆరుగురు ప్రభుత్వ అధికారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న కరోనా భాదితుల్లో 13 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, డ్రైవర్లు, ప్యూన్లుగా ఉన్నారు. ఇటీవల డిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌కు కరోనా సోకినట్లు గుర్తించిన తరువాత కార్యాలయంలో పని చేస్తున్న అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు ఆరోగ్య అధికారులు. అదేవిధంగా ప్రభుత్వానికి చెందిన ఆరుగురు అధికారులకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.డిల్లీలో తాజాగా 990 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల 20,834 కు చేరుకోగా, ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 523 కు చేరుకుందని ఇక్కడి అధికారులు తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 11,565 కాగా, 8,746 మంది రోగులు కోలుకున్నారని అధికారులు వివరించారు.

Follow Us