మాల్యాకు ఢిల్లీ హైకోర్టు షాక్

బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి విదేశాల్లో తలదాచుకున్న విజయ్ మాల్యాకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫెరా నిబంధనల ఉల్లంఘనల కేసులొ బెంగళూరులో ఉన్న విజయ్ మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దీపక్ షెరావత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో తదువరి విచారణ జూలై 10కి వాయిదా పడగా.. ఆ లోపు మాల్యా ఆస్తులను అటాచ్ చేయాలని వివరించారు. కాగా ఇప్పటివరకు మాల్యాకు సంబంధించిన […]

మాల్యాకు ఢిల్లీ హైకోర్టు షాక్

Edited By:

Updated on: Mar 23, 2019 | 3:57 PM

బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి విదేశాల్లో తలదాచుకున్న విజయ్ మాల్యాకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫెరా నిబంధనల ఉల్లంఘనల కేసులొ బెంగళూరులో ఉన్న విజయ్ మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దీపక్ షెరావత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో తదువరి విచారణ జూలై 10కి వాయిదా పడగా.. ఆ లోపు మాల్యా ఆస్తులను అటాచ్ చేయాలని వివరించారు.

కాగా ఇప్పటివరకు మాల్యాకు సంబంధించిన 159 ఆస్తులను గుర్తించినట్లు బెంగళూరు పోలీసులు న్యాయస్థానానికి తెలియజేశారు. ఇదిలా ఉంటే గత ఏడాది మేలో ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు ఆదేశించిన కోర్టు దీనిపై సమగ్ర నివేదికను అందించాలని కోరింది. ఈ కేసులో మాల్యాపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ పెండింగ్‌లో ఉన్న సంగతి విదితమే.