మందుబాబులకు షాక్… మద్యంపై కరోనా సెస్… 70 శాతం..

| Edited By:

May 05, 2020 | 12:19 PM

Coronavirus cess: కరోనా లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో.. ఢిల్లీ ప్రభుత్వం ఇవాళ్టి నుంచి మద్యం అమ్మకాలపై ప్రత్యేక కరోనా సెస్ విధించబోతోంది. కరోనా ఫీ పేరుతో… ఏకంగా 70 శాతం సుంకం విధించబోతోంది. అందువల్ల ఇవాళ్టి నుంచి ఢిల్లీలో మద్యం బాటిళ్ల ధరలు అమాంతం పెరగబోతున్నాయి. దీనిపై మందుబాబులు గగ్గోలు పెడుతున్నారు. MRPపై ఏకంగా 70 శాతం పన్ను విధిస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం మాత్రం… అసలు మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ […]

మందుబాబులకు షాక్... మద్యంపై కరోనా సెస్... 70 శాతం..
Follow us on

Coronavirus cess: కరోనా లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో.. ఢిల్లీ ప్రభుత్వం ఇవాళ్టి నుంచి మద్యం అమ్మకాలపై ప్రత్యేక కరోనా సెస్ విధించబోతోంది. కరోనా ఫీ పేరుతో… ఏకంగా 70 శాతం సుంకం విధించబోతోంది. అందువల్ల ఇవాళ్టి నుంచి ఢిల్లీలో మద్యం బాటిళ్ల ధరలు అమాంతం పెరగబోతున్నాయి. దీనిపై మందుబాబులు గగ్గోలు పెడుతున్నారు. MRPపై ఏకంగా 70 శాతం పన్ను విధిస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం మాత్రం… అసలు మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే గొప్ప అంటోంది. ఢిల్లీలో లిక్కర్ షాపులను ఉదయం 9 నుంచి సాయంత్రం 6.30 వరకు తెరుస్తున్నారు.

కాగా.. 40 రోజుల గ్యాప్ తర్వాత సోమవారం నుంచి ఢిల్లీలోని 150 లిక్కర్ షాపులు తెరచుకున్నాయి. పెద్ద సంఖ్యలో మందుబాబులు షాపుల ముందు క్యూ కట్టారు. అసలు సోషల్ డిస్టాన్స్ అనేదే లేకుండా పోయింది. ఓ దశలో పోలీసులు లాఠీ ఛార్జీలు కూడా చేయాల్సి వచ్చింది. నాలుగు జిల్లాల్లో లిక్కర్ షాపులను మూసేయాలని కూడా ఆదేశాలొచ్చాయి. ప్రజలు రూల్స్ పాటించని ప్రాంతాల్లో మళ్లీ కఠిన ఆంక్షలు పెడతామని సీఎం కేజ్రీవాల్ చెప్పారు.